Anushka Shetty : అనుష్క దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా?

Anushka Shetty

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రాధాన్యత ఉన్న పాత్రలకు ఇంపార్టెన్స్ ఇస్తూ పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీనీ సంపాదించుకుంది స్వీటీ. ఇక బాహుబలి సినిమా రిలీజ్ టైంలో ఈ దేవసేనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోయిన్ కు లేదు అని చెప్పాలి. అయితే ఆ సినిమా తర్వాత అనుష్క కెరీర్ కు స్పీడ్ బ్రేకులు వేసింది. చాలా తక్కువ సినిమాలు చేస్తూ అభిమానులను నిరాశ పరుస్తోంది అనుష్క. అయితే ఈ బ్యూటీ ఓ బ్లాక్ బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించింది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె దర్శకత్వం వహించిన సినిమా ఏంటి అంటే?

సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే చేసిన స్వీటీ ఆ తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి యాక్టింగ్ పరంగా తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. ముఖ్యంగా అరుంధతి సినిమా ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పట్లో హారర్ సినిమాలకు అరుంధతి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలకు టాలీవుడ్ లో కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అనుష్క. అందులో భాగంగానే రుద్రమదేవి, భాగమతి, సైజ్ జీరో వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఇందులో భాగమతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పటిదాకా హీరోయిన్ గా అదరగొట్టిన అనుష్క లోని ఒక్క యాంగిల్ మాత్రమే అభిమానులకు తెలుసు. అయితే ఆమెలో సినిమాలకు దర్శకత్వం వహించే మరో టాలెంట్ కూడా ఉందట. అలా స్వీటీ స్వయంగా దర్శకత్వం వహించి, హీరోయిన్ గా చేసిన ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇంతకీ అనుష్క దర్శకత్వం వహించిన ఆ సినిమా పేరు ఏంటి అనే విషయంలోకి వెళ్తే…

- Advertisement -

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం అనుష్క దర్శకత్వం వహించిన మూవీ భాగమతినే. అశోక్ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ మూవీ 2018లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ మూవీ 40 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అయితే ఈ సినిమాలో ఎక్కువ భాగానికి అనుష్కనే స్వయంగా దర్శకత్వం వహించారని తాజాగా ప్రచారం జరుగుతోంది. సినిమాలో ఉన్న కోన్ని హైలెట్ సీన్ల ఆలోచనను ఇచ్చింది కూడా అనుష్కనే అంటున్నారు.

ఇక డైరెక్టర్ అందుబాటులో లేని టైంలో అనుష్క స్వయంగా సినిమాకు దర్శకత్వం వహించారట. తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు అన్నిటిని అనుష్కనే తెరకెక్కించిందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు గానీ, ప్రస్తుతం అనుష్క నెక్స్ట్ మూవీ గురించి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఆమె అభిమానులు. రీసెంట్ గా క్రిష్ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా ఓ మూవీ తెరకెక్కుతోంది అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు