Anushka Shetty: ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం.. పశ్చాత్తాపడుతున్న స్వీటీ..!

Anushka Shetty

ఏ ఇండస్ట్రీలో నైనా సరే చాలామంది నటీనటులు ఏదైనా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే కచ్చితంగా ఆ సినిమా కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు అందులోని పాత్రలలో లీనమైపోయి నటిస్తూ.. కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు.. అలా చాలామంది బరువు పెరగడం.. బరువు తగ్గడం లేదా గుండు చేయించుకోవడం వంటి సాహసాలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎన్నోసార్లు ఆనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి ఒక్క నిర్ణయం వల్ల స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జీవితమే మారిపోయింది.. వాటి గురించి చూద్దాం.

సూపర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క శెట్టి మొదట యోగ టీచర్ గా ఉండేది. అందుకే ఆమె తన ఫిజిక్ తో కుర్రకారును బాగా ఆకట్టుకుంది. ఎన్నో చిత్రాలలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న అనుష్క బిల్లా సినిమాలో ఏకంగా బికినీలో కనిపించి.. మరింత ఆకట్టుకుంది. మరోవైపు సైజ్ జీరో కోసం ఒక్కసారిగా బరువు పెరగాలని డైరెక్టర్ సూచించడంతో ఆమె బరువు పెరుగుతానని చెప్పి కఠినమైన నిర్ణయం తీసుకుంది.

ఈ సినిమాలో అమ్మాయిలకు అందం అనేది మనసు లో మాత్రమే కానీ శరీర బరువులో కాదని ఒక ప్రయోగాత్మకంగా చిత్రాన్ని చూపించాలని సైజ్ జీరో సినిమాలో నటించింది. ఈ సినిమా కోసం అనుష్క భారీగా బరువు పెరిగింది. అయితే డైరెక్టర్ గ్రాఫిక్స్ లోనే బరువు పెరిగినట్లు చూపిద్దామనుకున్నారట కానీ ఈమె నాచురల్ గానే ఉంటుందంటూ బరువు పెరిగి చూపిస్తానని చెప్పడంతో డైరెక్టర్ ఒప్పుకున్నారు. అలా అనుష్క బాగా తిని చాలా బరువు పెరిగిపోయింది.

- Advertisement -

ఈ సినిమాలో కనిపించినట్లుగా స్వీటీ చాలా లావుగా కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. మరోవైపు సైజ్ జీరో సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఇక అనుష్క కష్టానికి ప్రతిఫలం లభించలేదు. ఇదంతా పక్కన పెడితే అప్పటినుంచి ఆరోగ్య విషయం లో చాలా మార్పులు వచ్చాయట. ఎంత బరువు తగ్గాలనుకున్నప్పటికీ అనుష్క తగ్గలేక పోయింది. ఇప్పటికీ కాస్త బొద్దుగానే కనిపిస్తోంది అనుష్క. దీనివల్ల చాలా రకాల ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. ఇటీవల అనుష్క ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

వైట్ అండ్ వైట్ ముఖానికి మాస్క్ వేసుకొని అమెరికాలో దిగుతున్న ఒక వీడియో వైరల్ గా మారుతోంది. స్వీటీ ని ఇలా చూసిన అభిమానులు ఆ రోజు సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరగకుండా ఉండాల్సింది స్వీటీ. అలాంటి తప్పు ఎందుకు చేసావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనుష్క కన్నడలో ఒక మూవీలో నటిస్తోంది. ఇకపోతే తెలుగులో బరువు పెరగడం కారణంగా అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టడంతో అనుష్క బాధపడుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన కొంతమంది అప్పుడే ఇంతటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం. అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఈ విషయంలో అనుష్క పశ్చాత్తాపడుతున్నట్లు తెలుస్తోంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు