Lokesh Kanagaraj : శృతి హాసన్ తో స్టార్ డైరెక్టర్ రొమాన్స్

Lokesh Kanagaraj

ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన స్టార్ట్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నటుడిగా మారబోతున్నాడు. ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్న ఈ కోలీవుడ్ డైరెక్టర్ శృతి హాసన్ తో డైరెక్ట్ గా రొమాన్స్ చేయబోతున్నాడు. అయితే లోకేష్ కనగరాజ్ నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నది సినిమాలో కాదు. ఓ మ్యూజిక్ వీడియో ద్వారా. వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేయబోతున్న ఈ స్పెషల్ మ్యూజిక్ వీడియోలో లోకేష్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. ప్రేమ గొప్పదనాన్ని చాటి చెబుతూ సాగే ఈ ఆల్బమ్ కు శృతి హాసన్ స్వయంగా పాటను రాయడమే కాకుండా సంగీతం అందిస్తోంది. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ తన కూతురి వాలెంటైన్స్ డే స్పెషల్ మ్యూజిక్ వీడియోకు నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం.

తాజాగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోకు సంబంధించిన పోస్టర్ ను ట్విట్టర్లో షేర్ చేసింది. లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ఈ మ్యూజిక్ వీడియోను కమల్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మ్యూజిక్ వీడియో షూటింగ్ గురువారం చెన్నైలో స్టార్ట్ కాబోతున్నట్టు సమాచారం. రెండు రోజుల్లోనే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి, ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో లోకేష్, శృతిహాసన్ మధ్య కెమిస్ట్రీ హైలెట్ కాబోతోందని అంటున్నారు.

మొత్తానికి వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఆ మ్యూజిక్ వీడియో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. ఇక ఇప్పటిదాకా డైరెక్టర్ గా పలు బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన లోకేష్ తనకు కమల్ హాసన్ తో ఉన్న అనుబంధం కారణంగానే ఈ మ్యూజిక్ వీడియోలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. కమల్ హాసన్ కు “విక్రమ్” సినిమాతో లోకేష్ కనగరాజ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఏకంగా 500 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. లోకేష్ త్వరలోనే హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

వాస్తవానికి గత కొంతకాలంగా లోకేష్ కు హీరోగా వరుస అవకాశాలు వస్తున్నట్టు సమాచారం. కానీ డైరెక్టర్ గా అదిరిపోయే సినిమాలను తెరకెక్కిస్తున్న కారణంగా,  ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా వాటిని రిజెక్ట్ చేశాడట. కానీ కేజీఎఫ్ స్టంట్ మాస్టర్స్ అన్బుఅరివు డైరెక్టర్లుగా ఎంట్రీ ఇవ్వబోతున్న మూవీతో లోకేష్ పూర్తిస్థాయిలో హీరోగా మారిపోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు శృతి హాసన్ ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, సలార్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం శౌర్యంగ పర్వం, డెకాయిట్ అనే సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే “ది ఐ” పేరుతో రూపొందుతున్న ఇంగ్లీష్ మూవీతో హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు