Dasari NarayanaRao Birth Anniversary : దిగ్గజాలకే గురువు.. దర్శకరత్న “దాసరి నారాయణరావు”..

Dasari NarayanaRao Birth Anniversary : దర్శకరత్న “దాసరి నారాయణ రావు”. టాలీవుడ్ లో ఒక దర్శక ప్రస్థానం. ఎంతో మంది దర్శకులకు నటులకు, టెక్నిషియన్స్ కి ఆదర్శప్రాయుడీయన. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దాయనగా, చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా, దర్శకులకు బాసటగా నిలిచిన మహోన్నత వ్యక్తి. దాసరి పేరును ఒక బ్రాండ్ గా తెలుగు సినీ చరిత్రలో ఆయనకంటూ పేజీలు ఏర్పాటు చేసుకున్న అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తిగా గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించిన ఘనుడాయన. తెలుగు ఇండస్ట్రీల ఎంతో మంది చేత గురువు అని పిలిపించుకున్న లెజెండ్. ఒక నటుడిగా, దర్శకుడిగానే కాదు, రాజకీయాల్లో సైతం రాణించిన దర్శక నట దిగ్గజం దాసరి నారాయణ రావు జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానాన్ని ఓ సారి గుర్తుచేసుకుందాం.

తాతా మనవడు నుండి సినీ ప్రస్థానం..

ఎక్కడో గోదావరి జిల్లా పాలకొల్లుకి చెందిన దాసరి నారాయణ రావు (Dasari NarayanaRao Birth Anniversary) నాటకాలపై మక్కువతో రవీంద్ర భారతి లో పలు నాటకాలు వేసేవారు. ఆ క్రమంలో మెల్లిగా సినిమాలవైపు ఆసక్తి మళ్లగా, బిగినింగ్ డేస్ లో పలు దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తూనే, కొందరి దర్శకుల దగ్గర ఘోస్ట్ రైటర్ గా కూడా పనిచేసారు. అయితే పాలగుమ్మి పద్మరాజుతో పరిచయంతో కలిసి సినిమాలకు కలిసి పనిచేస్తూ, ఆ తర్వాత కె. రాఘవ నిర్మాణంలో “తాతా మనవడు” అనే చిత్రం దర్శకత్వం వహించాడు. తొలి సినిమాతోనే ఘనవిజయం సాధించిన దాసరి ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత వరుసగా సంసారం సాగరం, స్వర్గం నరకం, బలిపీఠం వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత స్టార్ హీరోలతో భారీ సక్సెస్ ఫుల్ సినిమాలు తీశారు. ఎన్టీఆర్ తో మనుషులంతా ఒక్కటే, సర్దార్ పాపా రాయుడు, బొబ్బిలి పులి బ్లాక్ బస్టర్లు తీశారు. ఇక ఏఎన్నార్ తో ప్రేమాభిషేకం, ప్రేమ మందిరం, మేఘ సందేశం వంటి క్లాసిక్స్ ని కూడా తీశారు. అలాగే శోభన్ బాబు తో బలి పీఠం, స్వయంవరం, కృషం రాజు తో రంగూన్ రౌడీ, తాండ్రా పాపారాయుడు లాంటి చిత్రాలు తీసి తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా చక్రం తిప్పారు.

సందేశాత్మక చిత్రాలకు కేరాఫ్..

అయితే స్టార్ హీరోలతో కమర్షియల్ చిత్రాలు తీస్తూనే దర్శకరత్న పలు విప్లవాత్మక చిత్రాలు సందేశాత్మక చిత్రాలు తీయడం జరిగింది. కెరీర్ బిగినింగ్ నుండి చూసుకున్నా కూడా బలిపీఠం, ధర్మ పీఠం దద్దరిల్లింది, అమ్మ రాజీనామా, ఒసేయ్ రాములమ్మ, కంటే కూతుర్ని కను వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి ఆలోచింపచేసే చిత్రాలను అందించాడు. ఇక దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ సక్సెస్ అయిన దాసరి స్వయంవరం, మామగారు, ఒసేయ్ రాములమ్మ వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. ఇక దర్శకుడిగా 151 చిత్రాలకి పైగా దర్శకత్వం వహించి అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకెక్కారు. ఇక కేంద్రమంత్రి గా 2006 లో పనిచేసారు దాసరినారాయణ రావు. ఇక ఆ తర్వాత టాలీవుడ్ లో పెద్ద దిక్కుగా అన్ని పనులు చూసేవారు. 2017 లో అనారోగ్య కారణాలతో మే 30న కన్నుమూశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు