Dasari: చివరి నిమిషంలో ఇంత దీనస్థితిలో మరణించారా..?

Dasari.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ పెద్దగా, నటుడుగా, డైరెక్టర్ గా, నిర్మాతగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు పొందిన నటుడు దాసరి నారాయణ రావు.. అప్పట్లో ఈయన మాట కాదని ఏ సినీ సెలబ్రిటీ కూడా ఎలాంటి పని చేసేవారు కాదట. అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో నటుడు పోసాని పాల్గొంటూ.. దాసరి నారాయణ రావు గురించి పలు ప్రత్యేకమైన విషయాలను తెలియజేశారు.

Dasari: Did you die in such a poor condition at the last minute..?
Dasari: Did you die in such a poor condition at the last minute..?

అద్ద కట్టలేని పరిస్థితిలో దాసరి..

పోసాని కృష్ణ మురళి ఒకవైపు నటుడుగా చేస్తూనే.. మరొకవైపు రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు ..ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు పోసాని.. ఇలాంటి సమయంలో ఒక ఇంటర్వ్యూలో దాసరి నారాయణరావు జీవితంలో జరిగిన కొన్ని విషయాలను గుర్తు చేశారు.. గతంలో నటుడు దాసరి నారాయణరావు గురించి ఒక యాడ్ ఇచ్చారని.. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. దాసరి నారాయణరావు ఎంతో గొప్పగా బ్రతికారు.. కానీ చివరికి ఆయన అప్పుల పాలు అయి ఇంటికి అద్దె కట్టలేని స్టేజిలో ఉన్న సమయంలోనే ఆయనకు గుండెపోటు వచ్చిందంటూ తెలిపారు పోసాని.

ఆ పని చేయలేక ఎంతో ఇబ్బంది పడ్డారు..

అంత గొప్పగా బ్రతికినటువంటి ఈ నటుడిని బెంగళూరు, హైదరాబాద్ వంటి పెద్ద నగరాలలో ఉన్న పెద్ద హాస్పిటల్ కి తీసుకువెళ్లి ఆపరేషన్ చేయిస్తే బ్రతుకుతాడని.. అందుకోసం రెండు లక్షల రూపాయలు ఖర్చవుతుందని.. కానీ ఆ పని చేయకుండా కేవలం చిన్న హాస్పిటల్ కు తీసుకువెళ్లి.. ఒక 50,000 రూపాయలతో ఆపరేషన్ చేయించారని తెలిపారు పోసాని. అయితే ఆ సమయంలో తను రచయితగా ఉన్నానంటూ కూడా తెలియజేశారు పోసాని. ఈ విషయాన్ని ఒకానొక సందర్భంలో ఒక ఫిలిం రిపోర్టర్ తన దృష్టికి తీసుకొచ్చారని కూడా తెలుపుతున్నారు పోసాని.

- Advertisement -

దీనస్థితిలో మరణించారు…

ఆ సమయంలో దాసరి నారాయణరావుకి సినీ ఇండస్ట్రీ అండగా ఉండాలనుకున్నాను.. కానీ ఎవరు సహాయం చేయలేదని తెలిసి.. అందరితో పాటు ప్రజలకు కూడా ఈ విషయం తెలియాలని ఉద్దేశంతోనే ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు చేసి మరి ఆయన గురించి ఒక యాడ్ చేయించాను అని తెలిపారు పోసాని.. అయితే ఈ విషయం తెలుసుకున్న దాసరి నారాయణరావు తనని పిలిచి లేచి మరీ దండం పెట్టారని.. ఇలా చేస్తే తాను వెళ్ళిపోతానని.. అప్పటి విషయాలను సైతం పోసాని ఇప్పుడు గుర్తు చేశారు.. అంతేకాకుండా ఆయనకు తెలియకుండా కవరులో కొంత డబ్బు ఆయన దిండు కింద పెట్టి వచ్చానని కూడా వెల్లడించారు పోసాని. ప్రస్తుతం పోసాని చేసినటువంటి ఈ కామెంట్స్ విన్న దాసరి అభిమానులు ఎంతో గొప్పగా బ్రతికిన ఈయనకు చివరికి ఇలాంటి పరిస్థితి వచ్చిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు సినీ ఇండస్ట్రీలో చాలానే జరుగుతాయిఒకప్పుడు ఉన్నతంగా బ్రతికి చివరి నిమిషంలో దీనస్థితిలో మరణించిన వారు చాలామంది ఉన్నారు అలాంటి వారిలో సావిత్రి ముందు వరుసలో ఉంటారు. ఒకప్పుడు రాజ వైభోగం పొందిన ఆమె చివరి నిమిషంలో దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేక దాసరి నారాయణ రావే ఆమె దహన సంస్కారాలు నిర్వహించినట్లు సమాచారం. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో లెజెండ్రీ గా ఉన్న వీరు చివరి నిమిషంలో ఇలా దీనస్థితిలో మరణించడం బాధాకరమని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు