Tollywood : ఇకపై వీకెండ్ మారుతుందా? లాంగ్ వీకెండ్ కోసం మేకర్స్ కొత్త స్ట్రాటజీ?

Tollywood : టాలీవుడ్ లో గాని ఇండియా లో ఏ సినిమా ఇండస్ట్రీ లోనైనా గాని ఒక సినిమా రిలీజ్ కావడానికి వీకెండ్ దాకా వెయిట్ చేస్తారు ప్రేక్షకులు. ప్రతి వీకెండ్ లో శుక్రవారం సినిమాలు ప్రేక్షకుల ముందు వస్తాయి. అప్పుడప్పుడూ పండగల్లో కాస్త ముందు వెనక రిలీజ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో సినిమాల రిలీజ్ కోసం ప్రతి ఒక్కరు వీకెండ్ ను ఎంచుకుంటారు. చిన్న నుండి పెద్ద సినిమాల రిలీజ్ లు దాదాపుగా శుక్రవారం రోజునే ఉంటాయి. ఎందుకంటే శుక్రవారం మూవీ రిలీజ్ అయితే మొదటి రోజు ఎలాగూ ఓపెనింగ్స్ ఉంటాయి. తరువాత శని, ఆదివారాలు కలిసొస్తాయి. ఈ రెండు సెలవు రోజులు కావడంతో ఫ్యామిలీతో కలిసి అందరూ సినిమాలు చూడటానికి థియేటర్స్ కి వస్తారనే అంచనాతో ఈ పద్ధతిని చాలా ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నారు. అయితే ఈ పద్ధతికి ఎండ్ కార్డు పడిపోతుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఈ ఏడాదిలో పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోయే సినిమాలలో చాలా వరకు శుక్రవారం థియేటర్స్ లోకి రావడం లేదు. ఒక్క రోజు ముందుగా గురువారం నాడు డిఫరెంట్ డేట్స్ లో మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. దీంతో శుక్రవారం సినిమా రిలీజ్ అనేది భవిష్యత్తులో చరిత్ర అయిపోతుందనే ప్రచారం నడుస్తోంది.

పాన్ ఇండియా సినిమాలు గురువారానికే మొగ్గు?

ఇక టాలీవుడ్ (Tollywood) లో తెరకెక్కుతున్న పలు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ డేట్ల ప్రకారం ఈ ఇది రాబోయే పెద్ద సినిమాలు గురువారమే రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘ఇండియన్ 2’ జూన్ 13న ఐదు భాషలలో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. జూన్ 13 గురువారం ఉండడం విశేషం. ఇక ఆ తర్వాత టాలీవుడ్ నుంచి పాన్ వరల్డ్ చిత్రంగా రిలీజ్ కాబోయే కల్కి 2898ఏడీ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి వస్తోంది. ఇది కూడా గురువారమే కావడం గమనించదగ్గ విషయం. ఇక కల్కి మూవీ ఏకంగా 22 భాషలలో రిలీజ్ అవుతోంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్ కూడా ఆగష్టు 15న గురువారం రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నేచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేస్తోన్న సరిపోదా శనివారం మూవీ ఆగష్టు 29న రిలీజ్ అవుతోంది. ఈ డేట్ కూడా గురువారమే అని సమాచారం. ఇక ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 అక్టోబర్ 10న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. ఇది కూడా గురువారమే వస్తోంది. ఆ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ ని కూడా గురువారమే రిలీజ్ అయ్యేట్లు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఇక పై వీకెండ్ గురువారమా?

అయితే రీసెంట్ గా విడుదల డేట్లు ఫిక్స్ అయిన సినిమాలన్నీ, శుక్రవారానికి ఒక్క రోజు ముందుగా రావడం అనేది ఎవరికి వారు కో ఇన్సిడెంట్ గా జరిగినట్లు అనిపించడం లేదు. ఇండస్ట్రీలో(Tollywood) నిర్మాతలు డిస్కస్ చేసుకొని వీకెండ్ కలెక్షన్స్ పెంచుకోవడానికి సినిమాల రిలీజ్ డే ని ఒక రోజు ముందుకి తీసుకొని వచ్చి ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. ఈ ఫార్ములా పాన్ ఇండియా సినిమాలకి వర్క్ అవుట్ అయితే భవిష్యత్తులో అందరూ కూడా గురువారంను వీకెండ్ గా భావించి గట్టిగా ఫాలో అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఇదే వీకెండ్ కి పెద్ద సినిమాలు పోటీగా వచ్చినపుడు ఒక సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుని, మరో సినిమాకి హిట్ టాక్ వస్తే ఒక్కసారిగా థియేటర్ల దెబ్బ పడే ఛాన్స్ ఉంది. వీకెండ్ లో కూడా సినిమాని థియేటర్లలోంచి తీసేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ పెద్ద సినిమాలకు ఫ్యాన్స్ సమస్య వల్ల అలాగే ఉంచినా, చిన్న సినిమాలకు కష్టమవుతుందని అంటున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా మార్పు మంచిదే, కానీ సినిమాల జయాపజయాలను డిసైడ్ చేసేది మాత్రం ప్రేక్షకులు అన్న విషయాన్నీ మేకర్స్ గుర్తుంచుకోవాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు