Heroine Sneha: ఆ నిర్మాతతో పీకల్లోతు ప్రేమలో స్నేహ..ఫోటో వైరల్..!

Heroine Sneha.. ప్రముఖ హీరోయిన్ స్నేహ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో దూసుకుపోతోంది.. అంతేకాదు బుల్లితెర షోలలో కూడా అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటుంది స్నేహ.. ఇక ప్రత్యేకంగా పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ.. యాడ్స్ కూడా చేస్తున్న ఈమెకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక నిర్మాతతో స్నేహ పీకల్లోతు వరకూ ప్రేమలో ఉందని.. అయితే ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల అతడికి బ్రేకప్ చెప్పేసి ప్రసన్నకుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Heroine Sneha: Sneha in deeply love with that producer..photo viral..!
Heroine Sneha: Sneha in deeply love with that producer..photo viral..!

బిజినెస్ రంగం వైపు అడుగులు..

శ్రీకాంత్ , వెంకటేష్ , నాగార్జున, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి తన పాపులారిటీ సంపాదించుకున్న ఈమె తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషల్లో కూడా నటించి మెప్పించింది. కెరియర్ పీక్స్ లో ఉండగానే తమిళ నటుడు ప్రసన్న కుమార్ ను వివాహం చేసుకుంది .పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇటీవలే వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.. చెన్నైలో చీరల బిజినెస్ మొదలు పెట్టి.. తన క్రేజ్ ను బిజినెస్ పరంగా వినియోగించుకుంటూ అడుగులు వేస్తోంది.

ఆ నిర్మాత మోజులో స్నేహ..

ఈ క్రమంలోనే స్నేహకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అదేమిటంటే సినీ కెరియర్ మొదట్లో ఓ ప్రొడ్యూసర్ తో ప్రేమలో పడిందట స్నేహ.. కొన్నాళ్లు అతడితో ఎఫైర్ కూడా సాగించిన ఈమె.. అతడినే వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయింది. కానీ అప్పటికే ఆ నిర్మాత పలువురు అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేశారని తెలియడంతో..అతడిని కాస్త దూరం పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ విషయం అప్పట్లో పెను సంచలనానికి దారి తీసిన విషయం తెలిసిందే.. ఇక తర్వాత కొద్ది రోజులు ప్రేమ, పెళ్లికి దూరంగా ఉన్న ఈమె ఆ తర్వాత ప్రసన్నకుమార్ తో ప్రేమలో పడి అతడిని వివాహం చేసుకుంది.. ప్రస్తుతం నిర్మాతతో స్నేహ క్లోజ్ గా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.

- Advertisement -

ప్రసన్న కుమార్ తో ప్రేమాయణం..

స్నేహ అసలు పేరు సుహాసిని.. ఇక ఆల్రెడీ సుహాసిని అనే పేరుతో ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఉండడంతో ఈమె పేరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్నేహాగా మారిపోయింది..ఈమె కుటుంబం వారు తాతల కాలంలో రాజమండ్రిలో ఉండేవారట.. తండ్రి రాజారామ్ , తల్లి పద్మావతి.. సోదరి సంగీత, సోదరులు బాలాజీ , గోవింద్ కూడా ఉన్నారు .. ఇక ముంబైలో జన్మించిన ఈమె ఆ తర్వాత ఈమె కుటుంబం దుబాయ్ కి వెళ్లిపోవడంతో అక్కడే సెటిల్ అయింది. అయితే ఈమెను మొదటిసారి మలయాళ దర్శకుడు పాజిల్ ఇండస్ట్రీకి రెకమెండ్ చేయగా.. 2000 సంవత్సరంలో ఎంగెనా ఒరు నీల పక్షి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఇక తర్వాత అచ్చాముందు! అచ్చా ముందు! అనే సినిమాలో స్నేహ ప్రసన్నతో మొదటి సారి జతకట్టింది.. ఇక అప్పటి నుండి వీరి సంబంధం పై మీడియాలో అనేక పుకార్లు వచ్చాయి.. స్నేహ పాల్గొన్న అన్ని మోడలింగ్ షోలలో ప్రసన్న కనిపించేవారు.. ఇక కొద్ది కాలానికి ఆ పుకార్లను కొట్టివేసిన వీరు.. ఆ తర్వాత 2011 నవంబర్ 9న తమ బంధాన్ని ప్రకటించి.. 2012 మే 11న చెన్నైలో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు కూడా ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు