Mrunal Thakur: క్యూట్‌ అందాలతో మెరిసిన మృణాల్‌

MrunalThakur: బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి తెలియని వారుండరు. బాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్స్‌ ఉంటారు. వేళ్లతో లెక్కపెట్టలేనంత మంది హీరోయిన్స్‌ బాలీవుడ్ పరిశ్రమలో ఉన్నారు. మన తెలుగు చిత్ర పరిశ్రమలాగా కాకుండా.. అక్కడ అంతర్జాతీయ భామలు కూడా ఉంటారు. ఒక్క సినిమా సక్సెస్‌ అవుతే చాలు… స్టార్‌ హీరోయిన్‌ అయిపోతారు. అయితే… అందులోనే బాలీవుడ్ అందాల తార మృనాల్ ఠాకూర్ ఒకరు. బాలీవుడ్‌ కమ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో కంటే మన తెలుగులోనే ఎక్కువగా రాణిస్తోంది ఈ బ్యూటీ మృనాల్ ఠాకూర్.

ఇప్పటికే టాప్ హీరోలతో సినిమా చేసిన మృణాల్ ఠాకూర్ కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అయితే…..మృనాల్ ఠాకూర్, హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా విజయం తర్వాత ఈ భామకు వరుసగా తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో ఓ మాత్రం ఎక్స్పోజింగ్ కి అవకాశం లేకుండా చాలా హుందాగా, అందంగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మృణాల్ ఇప్పటికే నానితో 30 హాయ్ నాన్న సినిమాలు చేసింది. హాయ్‌ నాన్న సినిమా మంచి సక్సెస్‌ అందుకోవడంతో.. మృనాల్ ఠాకూర్ కు మరింత క్రేజ్‌ పెరిగి పోయింది. అలాగే విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమాలోని హీరోయిన్గా చేసింది. అయితే… ఫ్యామిలీ స్టార్ సినిమా పెద్దగా సక్సెస్‌ కాలేదు. కానీ మృనాల్ ఠాకూర్‌ కు ఉన్న క్రేజ్‌ ఎక్కడా కూడా తగ్గలేదు. ఇంకా పెరుగుతూనే ఉంది.

సీతారామం సినిమాతో కెరీర్‌ ఛేంజ్‌

- Advertisement -

బాలీవుడ్ అందాల తార మృనాల్ ఠాకూర్ కెరీర్ ను సీతారామం సినిమా మార్చేసింది. సీతారామం సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు ఈ బ్యూటీ మృనాల్ ఠాకూర్ కు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ అయితే పెరిగిందని చెప్పవచ్చును. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సినిమాలలో కూడా అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి. ఇక అంతకుముందే బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా మారుతున్న అమ్మడు ఇప్పుడు పాన్ ఇండియా హీరోల సరసన కూడా అవకాశాలను అందుకునే విధంగా అడుగులు వేస్తోంది మృనాల్ ఠాకూర్.

అందాల ఆరబోత
2014 సంవత్సరంలో మరాఠీ సినిమాలు విట్టి దండుతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ బ్యూటీ మృనాల్ ఠాకూర్. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసి సీతారామం సినిమాతో తెలుగులోకి వచ్చేసింది. ఇది ఇలా ఉండగా….. సోషల్ మీడియాలో కూడా హీరోయిన్ మృనాల్ ఠాకూర్ చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిత్యం తన అంద చందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. అదే విధంగా తాజాగా మెరుపుల డ్రెస్ లో ఈ బ్యూటీ మెరిసింది. ఏద అందాలు కనిపించేలా రెచ్చిపోయింది హీరోయిన్ మృనాల్ ఠాకూర్. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు