Sneha Ullal: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన స్నేహా ఉల్లాల్ ?

Sneha Ullal: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు. అలాగే అక్కడి నుంచి వచ్చిన వారికి ఎక్కువగా ఛాన్సులు ఇస్తారు దర్శక నిర్మాతలు. అలా ఇప్పటికే ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం ఎక్కడ కూడా సక్సెస్ కావడం లేదు. కొన్ని సినిమాలు చేసి… ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అలాంటి వారిలో ఒకరు స్నేహ ఉల్లాల్.

sneha-ullal

టాలీవుడ్ హీరోయిన్ స్నేహ ఉల్లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మస్కట్‌లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయమైంది. 2007 సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కనివిందు చేసింది స్నేహ ఉల్లాల్. ఆ తర్వాత అలా మొదలైంది సినిమాతో అందరిని మెప్పించింది. ఇక నేరుగా బాలయ్య హీరోగా చేసిన సింహ సినిమాలో నటించి అందరిని ఉరకలేతించింది హీరోయిన్ స్నేహ ఉల్లాల్.

అయితే మడత కాజా సినిమాలు చేసిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమా కూడా చేయలేదు ఈ బ్యూటీ. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ కనువిందు చేసింది. ఇది ఇలా ఉండగా తాజాగా స్నేహ ఉల్లాల్ తో కలిసి దిగిన ఫోటోను నటి తేజస్వి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో స్నేహ ఉల్లాల్ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫోటోలో స్నేహ ఉల్లాల్ కాస్త బొద్దుగా కనిపించింది. అయితే అప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తోంది ఈ అమ్మడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు