Telugu Actor : ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న టాలీవుడ్‌ నటుడు!

Posani Krishna Murali: టాలీవుడ్‌ నటుడు పోసాని కృష్ణ మురళీ గురించి తెలియని వారుండరు. అయితే.. ఆయన ఎప్పుడు సంచలనాలకు తెరలేపుతారు. ఇక తాజాగా ఏపీలో వైసీపీ పార్టీకి సపోర్ట్‌ చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ తరుణంలోనే.. సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని. రైతులు మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ పై కొన్ని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారన్నారు.

అసలు ల్యాండ్ టైటిలింగ్ వల్ల ఎలాంటి నష్టం ఎవరికీ ఉండదని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ నష్టం జరిగితే.. ఆత్మహత్య చేసుకుంటానంటూ సంచలన ప్రకటన చేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇది ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతికి, అందరికి తెలుసు….తెలుగుదేశం ఎన్టీఆర్ ది అని అందరికి తెలుసు అని వివరించారు. చంద్రబాబు సడెన్ గా వచ్చి తెలుగుదేశం నాది అని లాక్కున్నాడు.

ఇదేమని ప్రశ్నిస్తే తన మిత్రులతో చెప్పులతో కొట్టించారని ఆగ్రహించారు. న్యాయస్థానం కూడా టీడీపీ చంద్రబాబుదే అని చెప్పిందని పేర్కొన్నారు. రైతుల నుంచి ఒక్క గజం కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోరు. అలా చేసే విజయవాడ వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు టాలీవుడ్‌ నటుడు పోసాని కృష్ణ మురళీ. జగన్ ను కోల్పోతే ఆంధ్ర దేశం నాశనం అవుతుంది….నోట్లో అన్నం లాక్కున్న దుర్మార్గపు చంద్రబాబు మీకు పథకాలు ఇస్తాడా? అని నిలదీశారు. పేదల ప్రపంచానికి పహార కాస్తున్న దేవుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. Posani Krishna Murali

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు