Samantha: సినిమాలు మానేయనున్న సమంత ?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సమంత… ఆ తర్వాత ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్గా ఎదిగింది. గత 14 సంవత్సరాలలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గానే కొనసాగుతోంది సమంత. ఎక్కడ కూడా తగ్గకుండా ముందుకు సాగుతోంది.

అయితే… ఈ 14 సంవత్సరాల కెరియర్ లో హీరోయిన్ సమంత అనేక ఇబ్బందులను… ఎదుర్కొంది. మొట్టమొదటగా అక్కినేని నాగచైతన్యతో విడాకులు ఆ తరువాత మయోసైటీస్ అనే భయంకరమైన వ్యాధి సమంతను వేధించాయి. అయినప్పటికీ… ఇక్కడ కూడా తగ్గకుండా హీరోయిన్ సమంత ముందుకు వెళ్తోంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే తాజాగా సమంత గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారంది. హీరోయిన్ సమంత సినిమాలు మానేసి కేవలం బిజినెస్ చేయాలని అనుకుంటుందట.

ఇందులో భాగంగానే తాజాగా సమంత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. తన సఖి కంపెనీకి వర్క్ చేసేందుకు ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్, ఫ్యాషన్ డిజైనర్స్ కావాలని ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని… సోషల్ మీడియాలో సమంత పోస్ట్ పెట్టింది. ఇది వరకు అలా ఎప్పుడూ సమంత పోస్ట్ పెట్టలేదు. దీంతో సినిమాలు మానేసి కేవలం బిజినెస్ చేసినందుకు సమంత మగ్గుచూపుతోందని అందరూ అంటున్నారు. అంతలేదు..కానీ సమంత సినిమాలు చేస్తూనే.. బిజినెస్‌ చేస్తుందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. Samantha

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు