Priyamani: వేసవి కాలంలో అలాంటి పనులు చేస్తున్న ప్రియమణీ!

Priyamani: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పుడెప్పుడో 2003 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ హీరోయిన్ ప్రియమణి. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ బ్యూటీ… తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో అటు మలయాళం లో కూడా చాలా సినిమాలు చేసింది. ఇప్పటికీ ఈ బ్యూటీ కి ఎక్కడ కూడా క్రేజ్ తగ్గలేదు.

2003 సంవత్సరంలో ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ ప్రియమణి. ఆ తర్వాత 2006 సంవత్సరంలో పెళ్లయిన కొత్తలో సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక హీరోయిన్ ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ సినిమాల్లో కూడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంటుంది. నిజానికి ఈ బ్యూటీ కెరీర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కంటే సెకండ్ ఇన్నింగ్స్ లోనే జెడ్ స్పీడ్ తో దూసుకెళ్తోంది.

హీరోయిన్ ప్రియమణి ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటుంది. విలన్ మూవీతో బాలీవుడ్ కు పరిచయమైన ఈ చిన్నది చెన్నై ఎక్స్ప్రెస్, ఫ్యామిలీ మెన్ సినిమాలతో అక్కడక్కడ మంచి గుర్తింపు దక్కించుకుంది. కాగా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి చీర కట్టులో మెరిసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. చీర కట్టుకుని…సమ్మర్‌ లోనూ టెమ్ట్‌ చేస్తోందని టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణిపై కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు