Prabhas: ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ కు మద్దతు పలికిన ప్రభాస్.. పోస్ట్ వైరల్..!

Prabhas.. ఆంధ్రప్రదేశ్లో రేపు ఓటింగ్ జరగబోతున్న నేపథ్యంలో నిన్నటితో ప్రచార కార్యక్రమాలకు పుల్ స్టాప్ పెట్టేశారు ఆయా పార్టీ అధినేతలు.. ఇకపోతే ఎవరికివారు అధికారంలోకి రావాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.అందులో భాగంగానే కూటమితో పొత్తు కలుపుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తమ సొంత నియోజకవర్గమైన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈయనకు పోటీగా వంగవీటి గీత వైసిపి తరఫున పోటీ చేస్తోంది.. స్థానికంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న గీతాపైన భారీ మెజారిటీతో గెలవాలని పవన్ కళ్యాణ్ సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగంగానే సినీ గ్లామర్ జోడిస్తున్నారు..

పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ సెలబ్రిటీలు..

ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున సినీ సెలబ్రిటీలందరూ వచ్చి తెగ ప్రచారం చేసిన విషయం తెలిసిందే.. ముఖ్యంగా చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కు మద్దతు పలుకుతూ పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించండి అంటూ ప్రజలను అభ్యర్థించారు.. ఇక జబర్దస్త్ కమెడియన్లు అయితే నేరుగా పిఠాపురం వెళ్లి అక్కడ ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ కు మద్దతు పలకండి అంటూ ప్రజలను వేడుకున్నారు.. అంతేకాదు చిరంజీవి వంటి వారు సోషల్ మీడియా ద్వారా వీడియో వదిలి తమ తమ్ముడిని గెలిపించాలంటూ కోరుకున్న విషయం తెలిసిందే.. అంతేకాదు ఆయన తరుపున రామ్ చరణ్.. చిరంజీవి సతీమణి సురేఖ ఇద్దరూ కలసి పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు.. ఇకపోతే టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తుంటే మహేష్ బాబు , అల్లు అర్జున్, ప్రభాస్ మాత్రం ఈయనకు సపోర్టు చేయలేదు అంటూ పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పించారు..

ఎట్టకేలకు ప్రభాస్ కూడా మద్దతు..

Prabhas: Prabhas who finally supported Pawan Kalyan.. The post went viral..!
Prabhas: Prabhas who finally supported Pawan Kalyan.. The post went viral..!

దీంతో నిన్నటికి నిన్న అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ గెలవాలని.. ఆయనకు వెన్నంటే ఉంటానంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా పవన్ కళ్యాణ్ గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు.. తాజాగా ఈయన తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌కి స్వయంగా ఫోన్‌ చేసి.. పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్నికలలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ స్పష్టం చేశారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన ట్వీట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రభాస్ ఈ మాట చెప్పడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. మొత్తానికైతే ప్రభాస్ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు పలకడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

- Advertisement -

ప్రభాస్ కెరియర్..

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇప్పుడు కల్కి 2898 ఏడి అనే చిత్రంలో నటిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత రాజా సాబ్, స్పిరిట్ పంటి చిత్రాలలో ప్రభాస్ నటించబోతున్నారు.. ఈ చిత్రాల తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు