Venuswamy: అతడు చెబితేనే పవన్ వింటాడా.. చిరు కంటే తోపా..?

Venuswamy.. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా పేరు సొంతం చేసుకున్న వేణు స్వామి సినీ సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలను బహిర్గతం చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఈయన చేసే కామెంట్లు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ఒక్కొక్కసారి ఈయన చెప్పే మాటలు నిజమైతే.. మరొకసారి ట్రోల్స్ కి గురి చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రానే వచ్చేసాయి.. రేపు ఓటింగ్ కూడా జరగనుంది..ఈ ఎలక్షన్స్ లో ఎలాగైనా సరే వైసీపీ పార్టీని ఓడించడానికి కూటమి సాయశక్తులా పనిచేస్తోంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ పై వేణు స్వామి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

పవన్ కళ్యాణ్ పై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..

Venuswamy: Will Pawan listen if he says.. Topa than Chiru..?
Venuswamy: Will Pawan listen if he says.. Topa than Chiru..?

ఇకపోతే ఎప్పుడూ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఏదో ఒక నెగటివ్ కామెంట్ చేస్తూ ఉండే వేణు స్వామి నాగచైతన్య, సమంత విడాకుల గురించి ముందే చెప్పి పేరు తెచ్చుకున్నారు.. ఆ తర్వాత కూడా కొన్ని విషయాలు ముందుగా తెలియజేసి అందరి దృష్టిని తన వైపు లాక్కున్నారు.. అయితే ఆయన చెప్పినవన్నీ జరుగుతాయా అంటే అదీ లేదు.. ఏదో గూట్లోకి రాయేస్తే తగిలినట్టుగా… అప్పుడప్పుడు ఈయన వేసే బాణాలు గురి తప్పవు.. అందుకే ఆయన పేరు భారీగా పాపులారిటీ సొంతం చేసుకుంది.. ముఖ్యంగా సెలబ్రిటీస్ పైన ఏదో ఒకటి చెబుతూ బాగా పేరు తెచ్చుకున్న ఈయన.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి..

పవన్ త్రివిక్రమ్ మాట వింటాడు కానీ అన్న మాట వినడు..

- Advertisement -

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కి ఏదైనా చెబితే అది మంచి అయినా సరే ఆయన గ్రహించరు.. అసలు ఆయనకి మంచి చెప్పాలనుకున్న మగాడు ఈ ప్రపంచంలోనే లేడు.. పవన్ కళ్యాణ్ కి ఏదైనా చెప్పాలనుకున్న మగాడు, దమ్మున్న వాడు త్రివిక్రమ్ మాత్రమే.. కానీ ఆయన ఆయనకు మంచి చెప్పరు ..నాదెండ్ల మనోహర్ కూడా మంచి చెప్పరు.. పోనీ చిరంజీవి చెప్తారా అంటే ఆయన చెప్పినా పవన్ కళ్యాణ్ వినడు.. ప్రతి మనిషి జీవితంలో ఎవరో ఒక పెద్ద ఉండాలి.. వాళ్ళ మాట వారు తప్పకుండా వినాలి.. భర్తకి భార్య కూడా గురువే.. భర్త భార్యకి గురువే.. తల్లి, తండ్రి, అక్క, చెల్లి , అన్నా, తమ్ముడు వీళ్లంతా కూడా మన జీవితంలో గురువులే.. ఎప్పుడో ఒక అప్పుడు ఎవరో ఒకరి మాట మనం తప్పకుండా వినాల్సిందే.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్ని చెప్పినా ఎవరి మాట వినడు.. ఆయన అంటే నాకు చాలా ఇష్టం.. అయితే ఆ ఇష్టం వేరు ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలని నేను అనుకుంటున్నాను.. కానీ ఆయనకు రాజకీయాల్లో అవగాహన లేదు.. అలాంటిది రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ కావాలని చూస్తున్నారు.. కానీ ఆయన మంచికే చెబుతూ ఉంటాను. రాజకీయాలు మీకు కలిసి రావు సినిమాలే చేసుకోండి అని.. ఈ మాట చెప్పినా సరే జనసైనికులు నన్ను ట్రోల్ చేస్తూ ఉంటారు.. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మాటలు వింటారు కానీ చిరంజీవి మాటలు వినరు అంటూ వేణు స్వామి కామెంట్లు చేశారు.. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. మొత్తానికి అయితే ఒక కడుపున పుట్టిన అన్న మాటే వినడు కానీ చెడు మాటలు చెప్పే త్రివిక్రమ్ మాటలు వింటాడు అంటూ డైరెక్ట్ గానే చెప్పేశారు వేణు స్వామి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు