Nagendra Babu: ఆ రోజు నుంచి నేను అది అడగడం మానేశాను.. పవన్ కళ్యాణ్ పై అటువంటి పోస్ట్ పెట్టిన నాగబాబు..!

Nagendra Babu: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన సోదరుడు నాగబాబు మధ్య ఎటువంటి బాండింగ్ ఉంటుందో మనం పలుచోట్ల చూస్తూనే ఉన్నాం. తరచూ ఒకరికి ఒకరు ప్రేమ ఆప్యాయతలు చూపించుకుంటూ ఉంటారు. ఇక ఒక సమయం వచ్చినప్పుడు అండగా నిలబడతారు కూడా. తాజాగా జనసేన పార్టీ కోసం కూడా నాగబాబు అదే రేంజ్ లో కష్టపడుతున్నారు.

ఈ ఎన్నికలలో టికెట్ త్యాగం చేసిన కూడా ఏమాత్రం నిరాశకు లోనవ్వకుండా మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నాడు నాగబాబు.‌ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గలుపు బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. ఇక తాజాగా తెల్లవారితే ఎన్నికలు అనగా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అందులో పవన్ కళ్యాణ్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు.

Nag Babu who posted such a post on Pawan Kalyan
Nag Babu who posted such a post on Pawan Kalyan

నిన్ను నమ్మని వాళ్లకోసం కూడా ఎందుకు నిలబడుతున్నావ్ అని అడిగితే.. చెట్టుని చూపిస్తాడు. అది నాటిన వాళ్ళకి మాత్రమే నీడనిస్తుందా అని.. నీతో నడవని వాళ్ళ కోసం కూడా ఎందుకు నిందలు మోస్తున్నావు అని అడిగితే.. వర్షాన్ని చూపిస్తాడు అతనికి మొక్కకి ‌ రైతు కంటి నీ తడవకుండా పంటనే తడుపుతోందని.. అప్పట్నుంచి అడగటం మానేసి ఆకాశం లాంటి అతని ఆలోచన విశాలతని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను.. అంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు నాగబాబు. ప్రస్తుతం ఈయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు