SV17 Update : శ్రీ విష్ణు కొత్త మూవీ టైటిల్ లీక్

SV17 Update : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. కమర్షియల్ సినిమాలకు దూరంగా కంటెంట్ ఉన్న మూవీస్ తో ప్రయోగాలు చేస్తూ విభిన్నమైన పద్ధతిలో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాడు . రీసెంట్ గా ఓం భీమ్ బుష్ మూవీ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న శ్రీ విష్ణు ప్రస్తుతం తన 17వ మూవీతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్ లీక్ అయ్యింది.

శ్రీవిష్ణు 17వ మూవీ టైటిల్ లీక్

రైజింగ్ స్టార్ శ్రీ విష్ణు 17వ సినిమాను ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఉండబోతోంది అని తెలుస్తోంది. ఈ మూవీకి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా రెబా మౌనిక జాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తుండగా, లైట్ బాక్స్ మీడియా, పర్ఫెక్ట్ పిక్చర్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ కాగా, సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ టైటిల్ తాజాగా లీక్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ థ్రిల్లర్ మూవీ జానర్ కి తట్టుగానే మృత్యుంజయుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారనే వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇక మరోవైపు శ్రీ విష్ణు సైలెంట్ గా ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన 85% షూటింగ్ పూర్తయిపోయిందని తెలుస్తోంది. అంటే త్వరలోనే ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. మరి టైటిల్ విషయంలో క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే దాకా ఆగాల్సిందే.

మూడు సినిమాలను లైన్ లో పెట్టిన శ్రీ విష్ణు

కాగా రీసెంట్ గా శ్రీ విష్ణు..  ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణతో కలిసి ఓం భీమ్ బుష్ అనే మూవీతో థియేటర్లలో మేజిక్ చేశాడు. లాజిక్ లేకపోయినా సరే ఈ మూవీకి ఆడియన్స్ నుంచి బాగానే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం శ్రీ విష్ణు చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే తన 17వ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, శ్రీ విష్ణు 18, 19వ సినిమాలు కూడా సెట్స్ పైనే ఉన్నాయి. రీసెంట్ గా ఉగాది పండుగ సందర్భంగా శ్రీ విష్ణు 19వ సినిమా ఘనంగా లాంచ్ అయ్యింది. ఆ మూవీకి డైరెక్టర్ జానకి రామ్ మారెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్, విజిల్ వర్తి ఫిలిమ్స్, కెఎఫ్సి బ్యానర్లపై సీతా కుమారి కోత, గోపాలం లక్ష్మీ దీపక్, అనూష ద్రోణవల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక శ్రీ విష్ణు సామజ వరగమున, ఓం భీమ్ బుష్ సినిమాలతో వరుసగా రెండు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరి ఆయన నెక్స్ట్ మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు