Vishwambhara : సినిమాలో ఆ సెంటిమెంటే హైలెట్ అట..?

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న “విశ్వంభర” షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సినిమా అనౌన్స్ అయ్యాక సెట్స్ పైకి రావడం కాస్త ఆలస్యమైనా, ఒక్కసారి మొదలుపెట్టాక నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఆ మధ్య కొన్ని లీక్స్ కూడా సినిమాపై అంచనాలని పెంచేసాయి.యూవీ క్రియేషన్స్ వారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ‘విశ్వంభ‌ర‌’లో మెగా సెంటిమెంట్ వాడుతున్నారు అని తాజాగా వార్తలు వస్తున్నాయి. అన్నయ్యగా పిలిపించుకునే మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ తన పాత రూట్లోకి వెళుతున్నారని సినిమా యూనిట్ నుండి వార్తలు వస్తున్నాయి. అన్న‌య్య మాస్ ఇమేజ్ ని మ‌రోసారి సెంటిమెంట్ గా హైలైట్ చేస్తున్నారా, అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చాలా కాలం త‌ర్వాత చిరంజీవి న‌టిస్తోన్న సోషియో ఫాంట‌సీ చిత్ర‌మిది. ఇప్ప‌టికే షూటింగ్ కూడా ముగింపు ద‌శ‌కు చేరుకుంటుంది. ఈ నేప‌థ్యంలో సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందుతోంది.

Sister sentiment will be a highlight in Vishwambhara movie

మెగా సెంటిమెంట్ తో విశ్వంభర?

అయితే చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా(Vishwambhara)లో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో బ‌ల‌మైన సిస్ట‌ర్ సెంటిమెంట్ ఉండబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు చెల్లెళ్ళు ఉంటారని ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పైగా ఆ సెంటిమెంటే సినిమాలో హైలైట్ కాబోతుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే చెల్లెళ్లు పాత్ర‌ల‌కు సంబంధించి కొంత మంది యువ నాయిక‌ల్ని తీసుకున్నారు. అలాగే సినిమాలో ఖుష్బూ కూడా న‌టిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇక చిరంజీవి కి చెల్లెళ్ళు అనగానే అంద‌రికీ ‘హిట్ల‌ర్’ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో కూడా చిరంజీవికి ఐదుగురు చెల్లెల్లు ఉంటారు. సిస్ట‌ర్ సెంటిమెట్ తో ముత్యాల సుబ్బ‌య్య తెర‌కెక్కించిన ఆ సినిమా అప్ప‌ట్లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. సిస్ట‌ర్ సెంటిమెంట్ బ‌లంగా ప‌డ‌టంతోనే ఆ రేంజ్ స‌క్సెస్ వ‌చ్చింది. అంత‌కు ముందు చిరంజీవి నటించిన దొంగ, మగ మహారాజు, విజేత, అల్లుడా మ‌జాకా వంటి సినిమాల్లో కూడా సిస్ట‌ర్ సెంటిమెంట్ వ‌ర్కౌట్ అయింది. ఆ సినిమాలు చిరు కెరీర్ లోనే బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా నిలిచాయి. అలాగే ‘అన్న‌య్య’ సినిమాలో కూడా అన్న‌ద‌మ్ముల మ‌ధ్య అనుబంధాన్నే బేస్ చేసుకుని తీసారు. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

- Advertisement -

సిస్టర్ సెంటిమెంటే హైలెట్..

ఇక ఇప్పుడు మ‌ళ్లీ ‘విశ్వంభ‌ర’లో సిస్టర్ సెంటిమెంట్ ని ప్రధాన బలంగా వాడనున్నారట. ఈ సినిమాలో సిస్ట‌ర్ సెంటిమెంట్ ని అద్భుతంగా మేళ‌వించిన‌ట్లు తెలుస్తోంది. సిస్ట‌ర్ సెంటిమెంట్ లో ఏ హీరో న‌టించినా అది హిట్టే అని అప్పట్లో టాక్ ఉండేది. అందులోనూ మెగా ఇమేజ్ ఉన్న హీరో న‌టిస్తే ఆ హిట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌రిగ్గా ఇదే అంశాన్ని వ‌శిష్ట ‘విశ్వంభ‌ర‌’తో మ‌రోసారి స‌క్సెస్ కి ద‌గ్గ‌ర్లో క‌నిపిస్తున్నాడు. సోషియా ఫాంట‌సీ సినిమా కావ‌డంతో గ్రాఫిక్స్ వ‌ర్క్ ఎక్కువ‌గా ఉంటుంది. షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉన్నా నెల‌ల స‌మ‌యం సీజీకే ప‌డుతుంది. అందుకే చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెళ్ళగా సురభి, మీనాక్షి చౌదరి, ఇషా చావ్లా, ఆషిక రంగనాథ్ నటిస్తున్నారని సమాచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు