Ram Charan : ఇక ల్యాగ్ చేయొద్దని నిర్ణయించుకున్న చరణ్.. RC16 ఆరోజే మొదలు.?

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. శంక‌ర్ షణ్ముగం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మూడున్నరేళ్ల కిందే అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఇక రెండున్నరేళ్లగా ఈ సినిమా తెరకెక్కుతున్నా సినిమా నుండి ఇప్పటివరకు ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్, ఒక సాంగ్ మినహా మరే అప్డేట్ కూడా రాలేదు. ఇప్ప‌టికే అన్ని ప‌నులు పూర్తి చేసుకుని రిలీజ్ కావాల్సిన సినిమా ఇంకా సెట్స్ లోనూ ఉంది. తాజా స‌మాచారం ప్ర‌కారం 80 శాతం పూర్త‌యింద‌ని వార్త‌లొస్తున్నాయి గానీ అందులో నిజమెంతో తెలియ‌దు. ఇక ఈ సినిమా విష‌యంలో నిర్మాత దిల్ రాజు కూడా ఒకానొక స‌మ‌యంలో అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసిన సంగతి తెలిసిందే. రిలీజ్ ఎప్పుడ‌ని అభిమానులు చంటేస్తుంటే? రిలీజ్ అయిన‌ప్పుడు అవుతుందిలే అని దిల్ రాజు కూడా లైట్ తీసుకున్నట్లు క‌నిపించింది. ఇక రెండు నెల‌లుగా సినిమా అక్టోబ‌ర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ అవుతుంద‌ని కూడా ప్ర‌చారం సాగుతుంది. కానీ యూనిట్ నుంచి ఎలాంటి క‌న్ప‌ర్మేష‌న్ లేదు. శంకర్ మాత్రం ఇండియన్ 2 పైనే ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.

ఇండియన్ 2 రిలీజ్ అయ్యాకే గేమ్ ఛేంజర్ కొలిక్కి ?

ఇక శంకర్ షణ్ముగం ఇండియన్ 2 సినిమాపైనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా గేమ్ ఛేంజర్ ఏ అప్డేట్ కూడా రాలేదు. షూటింగ్ జ‌రుతుందని వార్తలొస్తున్నాయి త‌ప్ప అదెక్క‌డ‌న్న‌ది? ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి . కానీ ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఇండియన్ 2 పూర్తిగా రిలీజ్ అయితే గాని గేమ్ ఛేంజర్ పై శంకర్ దృష్టి పెట్టాడని అంటున్నారు. అయితే ఇండియన్2 జులై రెండో వారంలో రిలీజ్ అవుతుంది అంటున్నా, దానిపై కూడా కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే రిలీజ్ డేట్ ప్రకటించలేదు. పైగా రామ్ చరణ్ కూడా కొన్నాళ్లుగా లేజిగా సినిమాలు చేస్తూ వస్తున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ క్లింకార పుట్టడం వల్ల, అలాగే మెగా ఫ్యామిలీ లో వరుణ్ తేజ్ పెళ్లి వల్ల చరణ్ సినిమాలకి కాస్త గ్యాప్ ఇవ్వగా, ఇప్పుడు మాత్రం ల్యాగ్ చేయకూడదని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

The first schedule of Ram Charan Buchi Babu's movie RC16 will start in June
ఇక ల్యాగ్ చేయకుండా త్వరలో RC16 ప్రారంభం?

ఇక గేమ్ ఛేంజర్ రిలీజ్ ఇంకా లేట్ అవుతున్నందువల్ల ఈ నేప‌థ్యంలో తాజాగా రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) కూడా తెగించేసిన‌ట్లు క‌నిపిస్తుంది. బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో త‌న 16వ చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇక లేట్ చేయకుండా RC16 షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారట. బుచ్చిబాబు కూడా ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నాడు. ఇక జూన్ రెండో వారం నుంచి చ‌ర‌ణ్ ఆ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటాడ‌ని వార్తలు వస్తున్నాయి. ఈలోపు గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ పూర్త‌వుతుంది కాబ‌ట్టి చ‌ర‌ణ్ ప్ర‌ణాళిక అలా ఉంటుంద‌ని భావించారంతా. కానీ గేమ్ ఛేంజ‌ర్ తో ప‌నిలేకుండా 16వ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌డానికే చ‌ర‌ణ్ రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది. ఎట్టి ప‌రిప‌రిస్థితుల్లో ముందు అనుకున్న షెడ్యూల్ ప్ర‌కార‌మే షూటింగ్ చేసేద్దామ‌ని అందుకు అంద‌ర్నీ రెడీగా ఉండ‌మ‌ని చ‌ర‌ణ్ సంకేతాలు పంపారట‌. చ‌ర‌ణ్ ఇంత బ‌లంగా నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణంగా శంక‌ర్ లేట్ చేయడమే అని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇంకా శంక‌ర్ సినిమా మీద‌నే కూర్చుంటే ప‌వ‌వ్వ‌ద‌న‌కున్నాడో? ఏమో! అందుకే చ‌ర‌ణ్ జూన్ నుంచి కొత్త సినిమా షూట్ కి వెళ్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. మరి చూడాలి RC16 జూన్ లో ఖచ్చితంగా రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుందా లేదా..

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు