Pragya Jaiswal : క్యూట్ అందాలతో బాలయ్య భామ సోషల్ మీడియాలో రచ్చ..

Pragya Jaiswal : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో “ప్రగ్య జైస్వాల్” ఒకరు. సౌత్ భామ కాకపోయినా టాలీవుడ్ సినిమాలతోనే ఎక్కువగా ఫేమస్ అయిందని చెప్పాలి. ముందుగా తమిళ్, హిందీ సినిమాల్లో నటించినా రాని గుర్తింపు తెలుగు సినిమాలతో వచ్చింది. తెలుగులో మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైనా, వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక తొలి సినిమా భారీ విజయం సాధించకున్నా, డీసెంట్ హిట్ అనిపించుకోగా, ప్రగ్యా జైస్వాల్ కు నటన పరంగా మంచి పేరు తెచ్చిపెట్టింది. గ్లామర్ షో కి ఆ సినిమాలో స్కోప్ లేకున్నా తన అందం, అభినయం తో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది. కానీ ఒక్కటి కూడా సరైన సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు. అయితే బాలయ్యతో చేసిన “అఖండ”తో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దాంతో ఇండస్ట్రీ లో మళ్ళీ వైరల్ అయింది.

బిగినింగ్ లో వరుస సినిమాలు..

అయితే ప్రగ్య జైస్వాల్ (Pragya Jaiswal) హీరోయిన్ గా అంతగా సక్సెస్ కాకపోవడానికి కారణం స్క్రిప్ట్ సెలెక్షన్లలో లోపం అనే చెప్పొచ్చు. తాను హీరోయిన్ గా నటించిన గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర, సహా పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అలాగే జయ నాయకి నాయక లాంటి చిత్రాల్లో సైడ్ రోల్స్ చేయాల్సివచ్చింది. ఫలితంగా టాలెంట్ ఉన్నా సరైన సక్సెస్ లను అందుకువడంలో ఫ్లాప్ అయ్యింది. అయితే సినిమా ఛాన్సులు లేకున్నా ఈ భామ ఫాలోయింగ్ కు మాత్రం ఢోకా లేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టీవ్ గా ఉంటూ రచ్చ చేస్తుంది. హాట్ ఫోటోషూట్లతో వైరల్ అవుతూనే ఉంటుంది.

Pragya Jaiswal Hot photoshoots wiral on social media

- Advertisement -

హాట్ ఫోటోషూట్లతో రచ్చ..

ఇక ఈ రోజుల్లో హీరోయిన్లు పెద్దగా సినిమాలు చేయకున్నా, ఆఫర్లు రాకపోయినా తమ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నారు. దీనికి కారణం సోషల్ మీడియా అనే చెప్పొచ్చు. ఐశ్వర్య మీనన్ లాంటి హీరోయిన్లు ప్లాపుల్లో ఉన్నా అవకాశాలు రావడానికి కారణం వాళ్ళ గ్లామర్ షోలే. ఇక తాజాగా ప్రగ్య జైస్వాల్ కూడా తన అందంతో కట్టిపడేసింది. తాజాగా చేసిన ఫోటోషూట్ లో ఓ ఆరేంజ్, రెడ్ కలర్ మిక్సడ్ షర్ట్ తో కనిపించి, కనిపించినట్టు గ్లామర్ షో తో ఇంస్టాగ్రామ్ లో రచ్చ చేస్తుంది. తన క్యూట్ లుక్స్ తో ప్రగ్యా మళ్ళీ నిర్మాతలని ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది. ఇక తెలుగులో చివరగా అఖండ తో హిట్ అందుకోగా, మోహన్ బాబు సన్ అఫ్ ఇండియా లో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత తెలుగులో సినిమా చేయకపోయినా, ఇక్కడి దర్శక నిర్మాతలకు టచ్ లోనే ఉంటుంది. ఇక ప్రస్తుతం ఓ హిందీ సినిమాలో నటిస్తున్న ప్రగ్యా త్వరలో తెలుగులో ఓ స్టార్ హీరో సినిమాలో నటించబోతుందని వార్తలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు