Barbie Telugu OTT Release Date : రెండు ఓటిటిల్లోకి ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ మూవీ బార్బీ… తెలుగులో ఎక్కడ చూడొచ్చు అంటే?

Barbie Telugu OTT Release Date : 96వ ఆస్కార్ అవార్డుల్లో ఏకంగా 8 నామినేషన్స్ దక్కించుకుని దుమ్మురేపిన హాలీవుడ్ మూవీ బార్బీ రెండు ఓటిటిల్లోకి వచ్చేసింది. మరి ఈ మూవీని తెలుగులో ఎక్కడ వీక్షించవచ్చు? అనే వివరాల్లోకి వెళితే…

రెండు ఓటిటిల్లో బార్బీ…

ఆస్కార్ అవార్డ్ తో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్న హాలీవుడ్ మూవీ బార్బీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. 2023లో థియేటర్లలోకి వచ్చిన ఈ ఇంగ్లీష్ మూవీ అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి అడుగు పెట్టగా, శనివారం నుంచే తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా అందుబాటులో ఉన్న బార్బీ ప్రస్తుతం జియో సినిమా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

బార్బీని చూడగలిగేది వాళ్ళు మాత్రమే..

జియో సినిమాలో ప్రీమియర్ సబ్స్క్రైబర్లు మాత్రమే బార్బీ మూవీని చూసే అవకాశం ఉండగా, ప్రైమ్ వీడియోలో మాత్రం రూ. 149 రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. తెలుగు వర్షన్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది.

- Advertisement -

నామినేషన్స్ 8.. అవార్డు ఒక్కటే..

బార్బీ మూవీ 96వ ఆస్కార్ అవార్డుల్లో ఏకంగా ఎనిమిది ఆస్కార్ నామినేషన్స్ లో దక్కించుకుంది. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ పిక్చర్, బెస్ట్ సహాయ నటుడు, బెస్ట్ సహాయ నటి వంటి విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్న ఈ మూవీ ఒక్క అవార్డును మాత్రమే దక్కించుకుని ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మాత్రమే ఆస్కార్ అవార్డును అందుకుంది బార్బీ.

నిర్మాతలకు కాసుల వర్షం..

బాక్స్ ఆఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది బార్బీ. 128 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన బార్బీ ప్రపంచవ్యాప్తంగా 1.446 బిలియన్ డాలర్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. హాలీవుడ్ రికార్డులను తిరగ రాసిన ఈ మూవీ ఇండియాలోనే 150 కోట్ల వరకు వసూళ్లు కలెక్ట్ చేసింది. ఇండియాలో అత్యధిక వసూళ్లను రాబట్టిన హాలీవుడ్ సినిమాల్లో ఒకటిగా బార్బీ స్థానాన్ని దక్కించుకుంది.

బార్బీ కథ ఇదే…

బార్బీ మూవీ లో హాలీవుడ్ యాక్టర్స్ మార్గరెట్ రాబిన్, రేయాన్ గ్లోసింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి గ్రేటా గేర్విక్ దర్శకత్వం వహించారు. ఇక బార్బీ స్టొరీ విషయానికి వస్తే… అనుకోని సమస్యల వల్ల బార్బీ వరల్డ్ నుంచి రియల్ వరల్డ్ లోకి వస్తారు బార్బీ, కెన్. ఆ తర్వాత బార్బీ ముందు కెన్ తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు? వీళ్ళిద్దరూ సారా అనే అమ్మాయిని ఎందుకు కలవాలి అనుకున్నారు? బార్బీ బొమ్మలను తయారు చేసే మెటల్ సీఈవో వల్ల బార్బీ కి ఎదురయ్యే కష్టాలు ఏంటి? ఆ తర్వాత వీళ్ళిద్దరి జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి? అనే ఇంట్రెస్టింగ్ స్టోరీని చూసి తీరాల్సిందే. ఎప్పుడెప్పుడు బార్బీ ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న హాలీవుడ్ మూవీ లవర్స్ ఈ మూవీపై వెంటనే ఓ లుక్కేయండి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు