Actress Bhavana:పెళ్ళై 7 ఏళ్ళు.. 4 సార్లు అబార్షన్.. రూమర్స్ కి చెక్ పెట్టిన భావన..!

Actress Bhavana..సాధారణంగా సినీ సెలబ్రిటీల గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏవో ఒక రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వారి యొక్క వ్యక్తిగత విషయాలలో భాగమైన ప్రేమ, పెళ్లి గురించి కూడా పలు రకాల రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి విషయాల పైన కొంతమంది హీరోయిన్స్ గట్టిగానే రియాక్ట్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది అసలు పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. అలా తెలుగులో తక్కువ సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ భావన గురించి.. గతించిన కొన్నేళ్ల క్రితం పలు రకాల రూమర్స్ వినిపించాయి.. అయితే వీటిపైన తాజాగా స్పందించింది.. వాటి గురించి చూద్దాం.

Actress Bhavana: Married for 7 years.. 4 times abortion.. Bhavana checked the rumors..!
Actress Bhavana: Married for 7 years.. 4 times abortion.. Bhavana checked the rumors..!

కిడ్నాప్ చేశారు..

భావన ఒంటరి, మహాత్మ, జగడం, పగ, హీరో తదితర చిత్రాలలో నటించింది.. అయితే మహాత్మా సినిమాతో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది భావన. ఆ తర్వాత నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.. కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలో భావన కిడ్నాప్ కు గురై అప్పట్లో ఈ విషయం ఒక సెన్సేషనల్ గా మారింది.. కొంతమంది దుండగులు ఈమెను బంధించి మరీ లైంగికంగా దాడి చేశారని కూడా అప్పట్లో ఎక్కువగా వార్తలు వినిపించాయి. అయితే ఇందులో మలయాళ నటుడు దిలీప్ నిందితుడుగా ఉండడంతో.. అతడిని అరెస్టు కూడా చేశారు.

సినిమా ప్రమోషన్స్ లో రూమర్స్ పై క్లారిటీ..

2018లో నిర్మాత నవీన్ ను వివాహం చేసుకుంది భావన. ఆ తర్వాత మళ్లీ ఇన్ని సంవత్సరాలకు అడపా దడపా సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యింది.మలయాళం లో నడికార్ అనే చిత్రంలో ఇటీవలె నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన పైన వచ్చిన రూమర్స్ కి చెక్ పెట్టింది భావన.. గడిచిన కొన్నేళ్ల క్రితం తన మీద చాలా రూమర్స్ వచ్చాయని.. తాను వివాహం చేసుకున్నప్పుడు చాలామంది తప్పుడు వార్తలు సృష్టించారని కూడా వెల్లడించింది..

- Advertisement -

నరకం తట్టుకోలేక పోయా.. భర్తే అండగా..

ముఖ్యంగా తనకు చాలా సార్లు అబార్షన్ అయ్యింది అని.. పలు రకాల రూమర్స్ క్రియేట్ చేశారు ఏకంగా తాను చనిపోయాను అనే విధంగా కూడా ఒక రూమర్ క్రియేట్ చేశారని.. ఇలా ఎన్నో విధాలుగా తన జీవితంలో కొన్ని అసత్యాలు సృష్టించారు అంటూ వెల్లడించింది.. అప్పట్లో తన మీద జరిగిన ఇలాంటి కొన్ని ఆరోపణలు గుర్తుకు వస్తే అసలు ఆ విషయాలను తట్టుకోలేనట్టు ఎమోషనల్ గా మాట్లాడింది భావన. అలాంటి రూమర్స్ విన్నప్పుడల్లా కూడా చాలా మానసికంగా కృంగిపోయే దానిని కానీ వివాహమైన తర్వాత తన భర్త అండతోనే చాలా బలంగా మారిపోయాను అంటూ వెల్లడిస్తోంది భావన. అభిమానులైతే భావన తిరిగి తెలుగు ఇండస్ట్రీ లోకి రియంట్రీ ఇవ్వాలని కోరుతున్నారు.. మరి అభిమానుల కోరిక మేరకు భావన ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి. మొత్తానికి అయితే ఒక మంచి కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులైతే కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు