Coolie teaser Controversy : కూలీ టీజర్ పై స్పందించిన రజినీకాంత్…. ఏమన్నాడంటే?

Coolie teaser Controversy : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన కూలీ టీజర్‌లో తన పాటను అనుమతి లేకుండా ఉపయోగించారంటూ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌కు సంగీత స్వరకర్త ఇళయరాజా నోటీసు పంపిన విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ విమానాశ్రయంలో ఈ వివాదం గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మరి రజినీ రియాక్షన్ ఏంటి? అంటే..

జైలర్‌ సక్సెస్ తర్వాత రజనీకాంత్‌ ప్రస్తుతం వెట్టాయాన్, కూలీ అనే సినిమాలను చేస్తున్నారు. వెట్టాయన్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీ ఓ సినిమాలో నటించబోతున్నాడు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కూలీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

కూలి టిజర్ వివాదం ఇదే

ఇటీవలే కూలీ మూవీ టైటిల్ టీజర్ విడుదలై అభిమానుల నుండి మంచి ఆదరణ పొందింది. చాలా కాలం క్రితం రజనీకాంత్ హీరోగా నటించిన తంగమగన్‌ అనే మూవీలోని వా వ పభ వా పాటను టీజర్‌లో ఉపయోగించారు. ఆ పాటను ఇళయరాజా స్వరపరిచారు. ఇక ఇంటర్నెట్‌లో టీజర్ ట్రెండింగ్‌లో ఉండటంతో తన అనుమతి పొందకుండా, రాయల్టీ చెల్లించకుండా కూలీలో తన పాటను ఉపయోగించినందుకు ఇళయరాజా సన్ పిక్చర్స్‌కు నోటీసు పంపారు. ఇంకా సన్ పిక్చర్స్ సరైన హక్కులను పొంది పాటను ఉపయోగించుకోవాలని లేదా టీజర్ నుండి సంగీతాన్ని తీసివేయాలని కండిషన్ పెట్టారు ఆయన.

- Advertisement -

రజినీకాంత్ సమాధానం ఇదే

ఇప్పటికే ఇళయరాజా వైరముత్తు ఇష్యూ ఇంటర్నెట్‌లో పెను దుమారం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ముంబైలో షూటింగ్ ముగించుకుని చెన్నైకి తిరిగి వచ్చిన రజనీకాంత్‌ను కూలీ టీజర్‌లో వా వా పాప వా పాటను ఉపయోగించారని, దానిపై ఇళయరాజా నోటీసు పంపడంపై విలేకరులు ప్రశ్నించారు. రజనీకాంత్‌ స్పందిస్తూ కాపీరైట్‌ సమస్య అనేది కంపోజర్‌కు, నిర్మాతకు మధ్య జరిగే అంశమని అన్నారు రజినీ. అంటే మొత్తానికి ఈ విషయాన్ని సూపర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సన్ పిక్చర్స్ నిర్మాతలు తేల్చుకుంటారని చెప్పేశారు. కానీ ఇప్పటిదాకా ఈ ఇద్దరి నుంచి వివాదంపై ఎలాంటి స్పందన రాలేదు. మరి సన్ పిక్చర్స్ వారు ఇళయరాజాకు ఏం సమాధానం చెప్తారో చూడాలి.

రజినీకాంత్ సినిమాలు..

డీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో వెట్టాయాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. మంజు వారియర్. భగత్ బాసిల్, రానా, అమితాబ్ బచ్చన్, రితికా సింగ్ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ మూవీని సన్‌ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఈ మూవీ కాగానే రజినీ కూలీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

ఇళయరాజా వివాదం

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా తన 4,500 పాటల రైట్స్ కు సంబంధించిన అగ్రిమెంట్ ముగిసినప్పటికీ పలు సంగీత సంస్థలు ఇంకా వాడుకుంటున్నాయి అని ఆరోపిస్తూ చెన్నై హైకోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ ఇంకా జరుగుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు