Prasanna Vadanam Collection : ప్రసన్న వదనం కలెక్షన్స్ ఇంత వీకా.. ప్రమోషన్స్ వల్లే ఇలా అయ్యిందా?

Prasanna Vadanam Collection : రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి రెండు హిట్ సినిమాల తరువాత ప్రసన్న వదనం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో థియేటర్లోకి వచ్చాడు సుహాస్. కానీ ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. హిట్ అవుతుందేమో అనుకున్న ఈ మూవీకి నెగిటివ్ టాక్ తో కలెక్షన్స్ పరంగా నిర్మాతలకు షాక్ ఇస్తుంది.

మూడు సినిమాలు… వెనకబడిపోయిన ప్రసన్న వదనం

మే 3న థియేటర్లలోకి ప్రసన్న వదనం సినిమాతో పాటు తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించిన బాక్ అనే హర్రర్ మూవీ, అల్లరి నరేష్ కామెడీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడక్కు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే ప్రసన్న వదనం మూవీ కంటే ఈ రెండు సినిమాలకే బుకింగ్స్ పరంగా మంచి రెస్పాన్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏఏఏ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి చోట్ల బాక్, ఆ ఒక్కటి అడక్కు సినిమాలకే టికెట్ బుకింగ్స్ బాగున్నాయని టాక్ నడుస్తోంది. ప్రసన్న వదనం బుకింగ్స్ మాత్రం చాలా డల్ గా ఉన్నాయని సమాచారం. ఫస్ట్ డే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆడియన్స్ ను థియేటర్లను తీసుకురాలేకపోయింది ఈ మూవీ. దీంతో ఫస్ట్ డే ప్రసన్న వదనం మూవీ కలెక్షన్స్ కు బాగానే గండి పడింది. అయితే మూవీ టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ రాకపోవడానికి ప్రమోషన్స్ కారణం అనే మాట వినిపిస్తోంది. ఈ మూవీకి పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం వల్లనే కంటెంట్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ తగ్గాయి అని అంటున్నారు.

ప్రసన్న వదనం కలెక్షన్స్…

ప్రసన్న వదనం మూవీలో సుహాస్ హీరోగా, రాశి సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీకి సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే దర్శకత్వం వహించగా, లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ పై మణికంఠ జెఎస్, ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. హర్ష చెముడు, నందు కీలక పాత్రలు పోషించారు.

- Advertisement -

తొలి రోజున ప్రసన్న వదనం మూవీ ఆంధ్ర, తెలంగాణలో కలిపి 25 లక్షల షేర్ వసూలు చేసింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కలుపుకుని 10 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. మొత్తానికి మొదటి రోజు ఈ మూవీకి 35 లక్షల షేర్ తో పాటు 70 లక్షల గ్రాస్ వచ్చింది. శుక్రవారం అంటే మే 3న ఈ చిత్రం మొత్తం తెలుగు ఆక్యుపెన్సీ రేటు కేవలం 14.03%గా ఉంది. మార్నింగ్ షోలకు 13.77% ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం షోలుకు 14.29% మాత్రమే నమోదయ్యాయి.

ప్రసన్న వదనం ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రసన్న వదనం మూవీపై ట్రైలర్ తో అంచనాలు బాగానే పెరిగాయి. దానికి తగ్గట్టుగానే ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీ 2.50 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ డే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 35 లక్షలు మాత్రమే రాబట్టగలిగింది. అంటే ఈ సినిమా క్లీన్ హిట్ కావాలంటే మరో 2.15 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ మూవీకి నడుస్తున్న ఆక్యుపెన్సీ చూస్తే అసలు బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను సుహాస్ రీచ్ అవుతాడా అనే అనుమానాలు మొదలవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు