Best suspense thriller movies on Netflix : ఊపిరి తీసుకోవడం మరిపించే టాప్ 6 సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్… మీరూ ఓ లుక్కేయండి

Best suspense thriller movies on Netflix : ఓటీటీలో ఎన్నో డిఫరెంట్ జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. నేటి తరం ఓటిటి ప్రియులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క జానర్ సినిమాలు అంటే ఇష్టం. అందులో భాగంగానే కొంత మందికి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అంటే తెగ ఇష్టం ఉంటుంది. మరి అలాంటి మూవీ లవర్స్ కోసం నెట్ ఫ్లిక్స్ లో ఊపిరి తీసుకోవడం కూడా మరిపించే టాప్ 6 థ్రిల్లర్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం.

1. డార్క్

2017 లో రిలీజ్ అయిన ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తప్పిపోయిన ఒక పిల్లవాడు నాలుగు కుటుంబాలను సమాధానాల కోసం అడుగుతాడు. వాళ్లు మూడు తరాలుగా విస్తరించి ఉన్న మనసును కదిలించే ఓ రహస్యాన్ని వెలికి తీసే కథ డార్క్.

2. కాల్

2020లో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ సీరియల్ కిల్లర్ ఓ ఇంట్లో ఉండే సేమ్ ఫోన్ ద్వారా ఒక మహిళతో గత 20 ఏళ్ల తేడాతో కనెక్ట్ అవుతాడు. అంటే అతను పాస్ట్ నుంచి ప్రజెంట్ లో ఉన్న అమ్మాయితో సేమ్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. తన ఫేట్ మార్చుకోవడానికి ఈ సీరియల్ కిల్లర్ ఏం చేశాడు అనే ఇంట్రెస్టింగ్ స్టోరీని చూసి తీరాల్సిందే.

- Advertisement -

3. సొసైటీ ఆఫ్ ది స్నో

1972లో ఉరుగ్వే విమానం ఒక మారుమూల ప్రాంతంలో కుప్పకూలుతుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారు ఎలా అక్కడి నుంచి బయటపడ్డారు అన్నదే సొసైటీ ఆఫ్ ది స్నో స్టోరీ. ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది.

4. ఫెయిర్ ప్లే

కొత్తగా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఓ జంటకు ఎదురయ్యే హఠాత్ పరిణామమే ఈ ఫెయిర్ ప్లే. మరి దాని నుంచి ఈ కపుల్ ఎలా బయటపడ్డారు అనేది మూవీని చూసి తెలుసుకోవాలి.

5. మౌనిక ఓ మై డార్లింగ్

మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన జయంత్ ఒక రోబోటిక్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అతను ఓవైపు నిక్కిని ప్రేమిస్తూనే మరోవైపు అదే కంపెనీలో పని చేస్తున్న మౌనిక అనే అమ్మాయితో సంబంధం పెట్టుకుంటాడు. ఆ తర్వాత మౌనిక అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇదే విధంగా మౌనిక వల్ల ఆ కంపెనీలో మోసపోయిన వాళ్లు మౌనికతో పాటు అతన్ని కూడా చంపేయాలని ప్లాన్ వేస్తారు. మరి వీళ్ళిద్దరూ ఆ ప్రమాదం నుంచి బయట పడ్డారా ? అనే విషయం తెలియాలంటే ఈ క్రైమ్ కామెడీ స్టోరీని చూసి తీరాల్సిందే. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన ఈ హిందీ మూవీకి థియేటర్లలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

6. ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌజ్

పాస్ట్, ప్రజెంట్ మధ్య విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండే కుటుంబాన్ని వాళ్ళ గత ఇంటి జ్ఞాపకాలు వెంటాడుతాయి. దీంతో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న ఆ కుటుంబం వాటి నుంచి ఎలా బయటపడింది అన్ ఉత్కంఠ భరితమైన ఈ మూవీ స్టోరీని నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు