8 AM Metro OTT Release Date : ఎట్టకేలకు మల్లేశం మూవీ డైరెక్టర్ మూవీ… ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుందంటే?

8 AM Metro OTT Release Date : చేసిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తెలుగు డైరెక్టర్ రాజ్ రాచకొండ. మల్లేశం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి బాలీవుడకి వెళ్లి రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన ‘8ఏఎం మెట్రో’ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలైంది. విమర్శకుల నుంచి ప్రశంసలను దక్కించుకున్న ఈ 8ఏఎం మెట్రో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆ వివరాలు..

ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన మల్లేశం సినిమా విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితంపై రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఆ సినిమా అప్పట్లో మంచి హిట్ అయింది. ప్రియదర్శి సరసన అనన్య నాగళ్ళ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కేవలం విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాదు ప్రేక్షకుల ఆదురాభిమానాలు సైతం దక్కించుకున్నది. ఈ సినిమా తర్వాత తెలుగులోనే ఏదైనా స్టార్ తో సినిమా చేస్తాడేమో అనుకుంటే రాజ్ మాత్రం బాలీవుడ్ కి వెళ్లి అక్కడ గుల్షన్ దేవయా, సాయామీ ఖేర్ ప్రధాన పాత్రధారులుగా 8ఏఎం మెట్రో ఆమె సినిమా చేశాడు. ఈ సినిమా 2023 మే 19న తక్కువ థియేటర్లలో విడుదలైంది. అయితే విమర్శకుల నుంచి ఈ సినిమాకి మంచి ప్రశంసలు వచ్చాయి. పాజిటివ్ టాక్ కూడా వచ్చినా కలెక్షన్స్ విషయంలో మాత్రం పెద్దగా ఉపయోగ పడలేదు.

థియేటర్లలోకి వచ్చిన ఏడాది తరువాత..

థియేటర్లలో రిలీజైన సంవత్సరం తర్వాత ఇప్పుడు 8ఏఎం మెట్రో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు జీ5 ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ ప్లాట్ ఫామ్ లో మే 10వ తేదీన అర్ధరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 8ఏఎం మెట్రో సినిమాను ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన అందమైన జీవితం పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. అలాగే ప్రముఖ కవి గుల్జర్ రాసిన కొన్ని పద్యాలు కూడా ఈ మూవీలో వాడారు.

- Advertisement -

డైరెక్టరే ప్రొడ్యూసర్

8ఏఎం మెట్రో చిత్రాన్ని కిశోర్ గంజితో కలిసి దర్శకుడు రాజ్‍ రాచకొండ స్వయంగా నిర్మించారు. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం హైదరాబాద్ మెట్రోలోనే జరగడం మరో విశేషం. సుమారు 4 కోట్ల బడ్జెట్‍తో ఈ సినిమాను రూపొందించగా. మార్క్ కే రాబిన్ సంగీతం అందించగా.. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రంలో గుల్షన్, సాయామీతో పాటు కల్పిలా గణేశ్, ఉమేశ్ కామత్, నిమిషా నాయర్, ధీర్ చరణ్ శీవాత్సవ్, జే ఝా, మధు స్వామినాథ్ కీలకపాత్రలు చేశారు. మహారాష్ట్రకు చెందిన ఒక సాధారణ గృహిణి హైదరాబాద్ మెట్రోలో తరచూ ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడతాయి.. అయితే ఆమెకు ఉన్న ఒక డిజార్డర్ తెలిసి హీరో ఎలాంటి సహాయం చేశాడు అనే లైన్ లో ఈ సినిమా తెరకెక్కింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు