Political Web Series on OTT : ఈ 5 వెబ్ సిరీస్ లను చూస్తే రాజకీయ రంగులన్నీ అర్థమైనట్టే

Political Web Series on OTT : దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న వేళ ఎన్నికల వాతావరణం నెలకొంది. ఓట్ల ఆట, అధికార పగ్గాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పొలిటికల్ లీడర్స్ ఎవరికి వారే తమ సొంత పార్టీ, అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపుతూ ఓట్లు అడుగుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఓటింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. దేశం మొత్తం ఎన్నికల మూడ్‌లో ఉన్న నేపథ్యంలో రాజకీయాల ఆధారంగా తెరకెక్కిన 5 పవర్ ఫుల్ వెబ్ సిరీస్‌లను తప్పక చూడాలి. రాజకీయాల గచదరంగం, అందులోని ఎత్తులు, పైఎత్తులు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్‌లు చూస్తే చాలు. టాప్ 5 పొలిటికల్ వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం.

మహారాణి

పాలిటిక్స్ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘మహారాణి’కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ సిరీస్ మూడవ సీజన్ ఇటీవల విడుదలైంది. ఈ సిరీస్‌లో మొదటి భాగానికి కరణ్ శర్మ దర్శకత్వం వహించారు. రెండవ సీజన్‌కు రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహించారు. మూడవ సీజన్‌కు రవి భావే దర్శకత్వం వహించారు. హుమా ఖురేషితో పాటు, ఈ సిరీస్‌లో సోహమ్ షా, అమిత్ సియాల్, కనీ కుస్రుతి, ఇనాముల్హాక్ నటించారు. దీన్ని సోనీ లివ్‌లో చూడవచ్చు. ఇందులో నిరక్షరాస్యులైన సీఎం పాత్రను హుమా ఖురేషీ పోషించింది.

హౌస్ ఆఫ్ కార్డ్స్

2013 సంవత్సరంలో రూపొందించిన ‘హౌస్ ఆఫ్ కార్డ్స్’ అనే వెబ్ సిరీస్ అమెరికా రాజకీయాలను బాగా చూపించింది. ఇందులో మొత్తం ఆరు సీజన్లు ఉన్నాయి. దీని కథ వైట్ హౌస్ లోపల రాజకీయాలు, అమెరికాలో సెనేట్, కాంగ్రెస్ రాజకీయాలు, మేయర్ పై జరిగే కుట్రలను చూడొచ్చు. కెవిన్ స్పేసీ 5వ సీజన్‌లో ప్రధాన పాత్రలో నటించాడు. కానీ MeToo ఆరోపణల కారణంగా అతను ఆరవ సీజన్‌లో నటించలేదు. నటి రాబిన్ రైట్ పాత్ర కూడా ఇందులో స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్‌ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

- Advertisement -

తాండవ్

అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఉన్న ఈ పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను అలీ అబ్బాస్ జాఫర్ రూపొందించారు. గౌరవ్ సోలంకి స్క్రిప్ట్ అందించారు. సైఫ్ అలీ ఖాన్‌తో పాటు ఇందులో సునీల్ గ్రోవర్, తిగ్మాన్షు ధులియా, డింపుల్ కపాడియా, మొహమ్మద్ జీషన్ అయ్యూబ్, డినో మోరియా అనుప్ సోనీ వంటి గొప్ప తారలు ఉన్నారు.

సిటీ ఆఫ్ డ్రీమ్స్

‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’ ఇప్పటి వరకు రెండు సీజన్‌ లు రిలీజ్ అయ్యాయి. ఈ వెబ్ సిరీస్ కుటుంబంలోని రాజకీయాల సంక్లిష్టతలను వర్ణిస్తుంది. రాజకీయాల పరాకాష్టను ఇందులో చూపించారు. ఈ సిరీస్‌లో సచిన్ పిల్గావ్కర్, అతుల్ కులకర్ణి, ఎజాజ్ ఖాన్, ప్రియా బాపట్ వంటి స్టార్లు ఉన్నారు. ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది.

ది బ్రోకెన్ న్యూస్

ఈ వెబ్ సిరీస్ కథ కూడా పూర్తిగా రాజకీయాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో సోనాలీ బింద్రేతో పాటు శ్రియా పిల్గావ్కర్, జైదీప్ అహ్లావత్ ప్రధాన పాత్రలు పోషించారు. మీరు ఇది జీ5లో ప్రసారం అవుతోంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు