Hrithik Roshan : హృతిక్ రోషన్ స్టార్ అవ్వలేడని అనుకున్న తెలుగు డైరెక్టర్… ఎవరో తెలుసా?

Hrithik Roshan : ప్రస్తుతం గ్రీక్ గాడ్ గా హిందీ చిత్ర పరిశ్రమలో అగ్రనటుడిగా రాణిస్తున్న హృతిక్ రోషన్ స్టార్ అవ్వలేదని అనుకున్నాడట ఒక తెలుగు దర్శకుడు. ఆయన ఎవరంటే?

మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. శివ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన ఆయన ఆ తర్వాత కొంతకాలానికే బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ కూడా తనదైన మార్క్ చూపించాడు. అయితే ఇప్పటి స్టార్ హీరో హృతిక్ గురించి ఆయన భావించిన ఒక విషయాన్ని ఈ మధ్య చెప్పినట్టుగా ఒక వైరల్ వీడియోస్ లో బాగా ట్రెండ్ అవుతుంది. అసలు హృతిక్ రోషన్ గురించి రాంగోపాల్ వర్మ ఏం కామెంట్ చేశాడు? అనే విషయంలోకి వెళ్తే..

రచయిత దర్శకుడు నిర్మాతగా బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన రాకేష్ రోషన్ వారసుడిగా బాలీవుడ్ లో అడుగు పెట్టాడు హృతిక్ రోషన్. తండ్రి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కావడంతో చిన్నప్పుడే చాలా సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించాడు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే ఎన్నో సినిమాలు చేశాడు. అయితే హీరోగా అమీషా పటేల్ తో చేసిన కహోనా ప్యార్ హై సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వరుస అవకాశాలు లభించాయి. అలాంటి హృతిక్ రోషన్ గురించి రాంగోపాల్ వర్మ తప్పుగా అంచనా వేసినట్టుగా చెప్పుకొచ్చాడు.

- Advertisement -

తనకు మొదటిసారి ఆయన్ని చూసినప్పుడు స్టార్ అయ్యే అవకాశాలు లేవని, అంత పొటెన్షియల్ అతనిలో ఉంది అని అనిపించలేదని వర్మ చెప్పుకొచ్చాడు. అయితే తర్వాత పరిణామాల ప్రకారం అతను స్టార్ గా ఎదిగాడని రాంగోపాల్ వర్మ ఒప్పుకున్నాడు. అయితే హృతిక్ మొదటి సినిమా డిజాస్టర్ కావడంతో ఆయనతో ఎవ్వరూ సినిమా చేయడానికి ముందుకు రాలేదని, అందుకే అతను స్టార్ అయ్యే ఛాన్స్ లేదు అన్పించిందని చెప్పుకొచ్చాడు వర్మ.

ఇక వర్మ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతానికి రామ్ గోపాల్ వర్మ కేవలం వివాదాస్పద అంశాలను మాత్రమే టచ్ చేస్తున్నాడు. ఏ సినిమా చేస్తే వివాదం అవుతుంది అని సరిగ్గా చెక్ చేసుకుని మరీ సినిమాలు చేస్తున్నాడు ఏమో అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పొలిటికల్ సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన ప్రస్తుతానికి పొలిటికల్ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు దాదాపు కోటిన్నర రూపాయలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

ఇక మరో పక్క హృతిక్ రోషన్ సినిమాల విషయాని కొస్తే ఆయన ఇప్పుడు వార్ 2 అనే సినిమా చేస్తున్నాడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గతంలో వచ్చిన వార్ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ గొడవ పడే పాత్రల్లో నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు