Kannappa : కేవలం పది రోజుల కోసం అక్షయ్ కుమార్ ఇంత తీసుకున్నాడా?

Kannappa : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో “కన్నప్ప” సినిమా ఒకటి. మంచు విష్ణు హీరోగా ప్రధాన పాత్రలో కన్నప్ప గా నటిస్తున్న ఈ సినిమాను మంచు మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే. మోహన్ బాబు దగ్గరుండి ఈ సినిమా షూటింగ్ ని పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ సినిమా పై ముందుగా ఏమాత్రం అంచనాలు లేవు గాని, ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ లోకి ప్రభాస్ ఎంటర్ అయ్యాడో అప్పట్నుంచి ఈ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చినా ట్రెండ్ అయి కూర్చుంటుంది. పైగా ఈ సినిమా మైథలాజికల్ ఫిక్షనల్ డ్రామా గా తెరకెక్కుతుండగా, ఈ సినిమాలో ప్రభాస్ పరమ శివుడిగా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాడు. ఇక కృష్ణం రాజు నటించిన భక్త కన్నప్ప సినిమాకి ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ కి సంబంధించి షూట్ వివరాలు ఇప్పటివరకూ సరిగా తెలియలేదు. కానీ ఈ చిత్రంలో నటిస్తున్న ప్రతి ఒక్క నటీనటుల షెడ్యూల్ వివరాలు ఎప్పటికప్పుడు బయటికి వస్తున్నాయి.

పది రోజులకు రెమ్యూనరేషన్ ఇంత?

ఇక సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఈ సినిమాలో దించుతున్న మోహన్ బాబు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ని కూడా ఈ సినిమాలో భాగం చేసారని తెలిసిందే. ఇక మంచు విష్ణు ఈ సినిమా కోసం ఆల్ మోస్ట్ 100 కోట్ల రేంజ్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉండగా ఇతర ఇండస్ట్రీల యాక్టర్స్ కూడా సినిమాలో నటిస్తూ ఉండటంతో సినిమా మీద బజ్ పెరుగుతూ వస్తుంది. రీసెంట్ గా సినిమాలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ స్పెషల్ రోల్ కోసం ఒప్పించగా ఆ రోల్ తాలుకూ షూటింగ్ ను రీసెంట్ గా కంప్లీట్ చేశారట. దాదాపు పది రోజుల్లోనే తనకి సంబంధించిన షూట్ ని పూర్తి చేసేసినట్టు సమాచారం. అయితే ఈ పది రోజుల కోసం అక్షయ్ కుమార్ కి భారీ మొత్తం లో రెమ్యూనరేషన్ ని ఇచ్చారని తెలుస్తుంది. ఆల్ మోస్ట్ పది రోజులకు పైగా షూటింగ్ లో పాల్గొన్న అక్షయ్ అందుకు గాను 6 కోట్ల దాకా రెమ్యునరేషన్ ని అక్షయ్ కుమార్ తీసుకున్నట్లు సమాచారం.

సౌత్ స్టార్ క్యాస్ట్..

ఇక మంచు ఫ్యామిలి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ (Kannappa) చిత్రంలో ఇతర ఇండస్ట్రీల నుండి కూడా భారీ తారాగణం నటిస్తున్నారు. తమిళ్ నుండి శరత్ కుమార్, మలయాళం నుండి మోహన్ లాల్ తో పాటు ప్రభాస్ సహా భారీ తారాగణం నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో మోహన్ బాబు, బ్రహ్మానందం, మధుబాల, దేవరాజ్, ఐశ్వర్య, ముఖేష్ ఋషి, రాహుల్ మాధవ్, కౌశల్ మంద, రఘుబాబు, సప్తగిరి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతో మంచు విష్ణు తన కెరీర్ మరో మలుపు తీసుకుంటుందని భావిస్తున్నాడు. ఏది ఏమైనా ఈ సినిమా టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటిగా తెరకెక్కుతోందని చెప్పొచ్చు. అయితే రిలీజ్ టైం నాటికి ఈ సినిమా బడ్జెట్ మరింత పెరిగిపోయే అవకాశం ఉంది.

- Advertisement -

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు