Aa Okkati Adakku : టాక్ ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ తో తన కామెడీ క్రేజ్ చూపించాడు!

Aa Okkati Adakku : టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన క్రేజీ చిత్రాల్లో అల్లరి నరేష్ నటించిన “ఆ ఒక్కటి అడక్కు” సినిమా కూడా ఒకటి. అల్లరి నరేష్ చాలా రోజుల తర్వాత నటించిన కామెడీ సినిమా అవడంతో ఈ సినిమాపై మంచి క్రేజీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు నుండే పక్కాగా కామెడీ సినిమా గానే ప్రమోషన్ చేసారు. బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైంకి కామెడీ ఎంటర్టైనర్ తో వచ్చిన అల్లరి నరేష్ సినిమా థియేటర్లలో మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజీవ్ చిలక ‘చిలక ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇక మే 3న ప్రసన్నవదనం సినిమాతో పాటు పోటీగా రిలీజ్ అయిన ఈ చిత్రం డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న నరేష్ సినిమా..!

అయితే ఈ సమ్మర్ లో రిలీజ్ అయినా కూడా ఎండలు, ఎలక్షన్స్ అలాగే IPL మ్యాచుల ఇంపాక్ట్ పడినప్పటికీ కూడా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనిపించేలా ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమాకి కొంచం మిక్సుడ్ టాక్ వచ్చినా కూడా, బుక్ మై షోలో మొదటి రోజు ఆల్ మోస్ట్ 16 వేల దాకా టికెట్ సేల్స్ జరగగా ఆఫ్ లైన్ లో కూడా డీసెంట్ బుకింగ్స్ జరిగాయి. అల్లరి నరేష్ ప్రీవియస్ మూవీ ఉగ్రమ్ మొదటి రోజున 61 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోగా ఇప్పుడు వచ్చిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ కూడా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 55 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు టాక్ ఇంకా బెటర్ గా వచ్చి ఉంటే కలెక్షన్స్ ఇంకా బెటర్ గా సొంతం చేసుకుని ఉండేది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మరో 10 లక్షల లోపు షేర్ ని అందుకోగా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 65 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని సినిమా సొంతం చేసుకుందని సమాచారం.

వీకెండ్ లో గ్రోత్ చూపిస్తుందా?

ఇక అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు(Aa Okkati Adakku) సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 65 లక్షల షేర్ ని వసూలు చేయగా, 1.40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం జరిగింది. ఇక ఈ సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 4 కోట్ల రేంజ్ లో ఉండగా, ఈ సినిమా 4.5 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ ని పక్కన పెట్టినా కూడా ఇంకా 3.90 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఈ వీకెండ్ లో సినిమా గ్రోత్ ని చూపించి తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా హోల్డ్ ని కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ కి అవకాశాలు ఉంటాయి. మరి ఈ సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ తో ఆ ఒక్కటీ అడక్కు ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుందో చూడాలి. శని, ఆది వారాల్లో అయితే ఖచ్చితంగా మంచి గ్రోత్ ని చూపిస్తుందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు