Prathinidhi2 : కొత్త రిలీజ్ డేట్ ప్రకటన.. ఇప్పుడైనా ఖచ్చితంగా వస్తారా?

Prathinidhi2 : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ చాలా రోజుల గ్యాప్ తర్వాత నటించిన సినిమా “ప్రతినిధి2”. ఈ సినిమా నారా రోహిత్ గతంలో నటించిన ప్రతినిధి సినిమాకి సీక్వేల్ గా తెరకెక్కిందన్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కూడా మెప్పించడం తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కాకపోతే ఆడియన్స్ కి ఈ సినిమా రీచ్ కావడానికి మేకర్స్ మరింత ప్రమోషన్స్ చేయాల్సి ఉండగా, అనూహ్యంగా ప్రతినిధి2 సినిమాను (Prathinidhi2) మేకర్స్ తమ సినిమా రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మూవీతో ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమా లో కథ నేపథ్యం ప్రస్తుత రాజకీయ పరిస్థితులను టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నాయి. అయితే మేకర్స్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోకపోవడం వల్లే రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే నెటిజన్ల అభిప్రాయం ప్రకారం ప్రతినిది 2 సినిమా రాజకీయ కోణంలో ఎన్నికల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడం వల్ల, మరి కొన్ని రోజుల్లో ఎలెక్షన్లు ఉన్నందువల్ల, ఓ రాజకీయ వర్గం సినిమాని వాయిదా వేయించిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా ప్రతినిధి 2 కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ కావడం జరిగింది.

కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్..

అయితే ప్రతినిథి 2 సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ తాజాగా జరిగింది. రెండు వారాల కింద వాయిదా పడిన ఈ సినిమాను తాజాగా మే 10న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఏది ఈమయినా ఈ సినిమా ఎన్నికలకి కొన్ని రోజుల ముందు వచ్చి ఉంటె సినిమా చూసే కొంతమంది జనాలకు ఓటింగ్ పై ఒక అవగాహన వచ్చి ఉండేదని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో దినేష్ రాజ్, సప్తగిరి, జిషు సేన్ గుప్త, సచిన్ ఖడేకర్, అజయ్, తనికెళ్ళ భరణి, ఇంద్రజ, ఉదయభాను, అజయ్ ఘోష్ తదితరులు నటించారు. అయితే నెటిజన్ల అభిప్రాయం ప్రకారం ఈ సినిమా ఆ రిలీజ్ డేట్ కి అయినా వస్తుందా? లేదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పుడైనా టైం కి వస్తుందా?

అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ప్రతినిథి2 సినిమాను మే 10న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. అయితే ఈ టైం కి అయినా సినిమా రిలీజ్ చేస్తారా లేదా? అన్న అనుమానాలు ఆడియన్స్ కి వస్తున్నాయి. ఎందుకంటే ఎలక్షన్స్ కి సరిగ్గా మూడు రోజుల ముందు ఈ సినిమా రిలీజ్ అంటే ప్రస్తుతం ఎలెక్షన్ల ప్రచారంలో ఉన్న రాజకీయ పార్టీలలో కొన్ని విడుదల చేయనిస్తాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా ఒకవేళ అలాంటి ఇబ్బంది ఎదురయితే ఎలక్షన్ల సమయంలో తెలిసిపోతుంది కూడా. ఒక్కసారి రిలీజ్ అయ్యాక ఏమి చేయలేరు కూడా. కాబట్టి సినిమా రిలీజ్ కి అడ్డంకులు ఎదురయినా, రిలీజ్ అయితే మంచిదని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు