Pushpa The Rule : పుష్ప రాజ్ నుండి రెండో సింగిల్ కు ముహూర్తం ఆరోజున?

Pushpa The Rule : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టులలో “పుష్ప ది రూల్ ఒకటి”. ఈ సినిమాకోసం అభిమానులతో పాటు, కామన్ ఆడియన్స్ కూడా ఎంతో వెయిట్ చేస్తున్నారు. ఇక పుష్ప 2 నుండి రీసెంట్ గా పుష్ప పుష్ప పేరుతో టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల కింద రిలీజ్ అయిన ఆ పాట సోషల్ మీడియాలో సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. పుష్ప అభిమానులకు మాంచి కిక్కిచ్చింది. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి అన్ని భాషల్లోనూ ఎంతగానో వెయిట్ చేస్తూ ఉండగా, హిందీ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారని తెలిసిందే. నిజం చెప్పాలంటే పుష్ప పార్ట్ వన్ తెలుగు కంటే ఎక్కువగా హిందీలోనే ఆడిందని చెప్పొచ్చు. ఇక తాజాగా రిలీజ్ అయిన పుష్ప ది రూల్ టైటిల్ సాంగ్ తెలుగులో కంటే, హిందీ వెర్షన్ కే అద్భుతమైన స్పందన వస్తుందని చెప్పాలి. ఇక పుష్ప 2 సినిమాను హిందీలోనే కాకుండా బెంగాలీ లోనూ రిలీజ్ చేస్తుండడం విశేషం. ఇక రిలీజ్ అయిన పాటలతో పాటు బెంగాలి సాంగ్ ని కూడా రిలీజ్ చేయగా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. తాజాగా పుష్ప నుండి రెండో సాంగ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

అప్పుడే రెండో సాంగ్ కి రెడీ?

ఇక పుష్ప ది రూల్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో భారీ రికార్డులు క్రియేట్ చేయలేకపోయినా, అభిమానులని మాత్రం అలరిస్తుంది. ఇక ఆ సాంగ్ లో హీరో పై వచ్చే లిరిక్స్ గూస్బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. పుష్ప ని మించి ఉన్న ఎలివేషన్స్ ఈ సినిమాలో పది రెట్లకి పైగానే ఉంటాయని తెలుస్తుంది. ఇక తాజా సమాచారం ప్రకారం పుష్ప నుండి రెండో లిరికల్ సాంగ్ ని కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఈ సినిమా యొక్క రెండో సాంగ్ కూడా ఆల్మోస్ట్ అల్లు అర్జున్ పైనే ఉండబోతుందని సమాచారం. ఇక ఈ రెండో పాటను జూన్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. అయితే మేకర్స్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం సినిమా అగస్ట్ 15న రిలీజ్ అవుతుంది కాబట్టి, రిలీజ్ కి చాలా టైం ఉండడం వల్ల ఈ సినిమా నుండి నెలకో సాంగ్ ని మాత్రమే రిలీజ్ చేద్దామని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

వెయ్యి కోట్ల టార్గెట్ తో పుష్ప2..!

ఇక పుష్ప ది రూల్ (Pushpa The Rule) సినిమాతో మేకర్స్ ఏకంగా 1000 కోట్ల వసూళ్లపై కన్నేశారు. సినిమా బడ్జెట్ కి తగ్గట్టు, హైప్ కి తగ్గట్టే బిజినెస్ కూడా జరుగుతుందని సమాచారం. ఇక ఇప్పటికే ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా 250 కోట్లు అందాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లకి పైగా బిజినెస్ చేయబోతున్న ఈ సినిమా హిందీలో కూడా రెండు వందల కోట్ల బిజినెస్ చేయనుంది. ఇక ఈ సినిమాతో హిందీ వెర్షన్ లో అల్ టైం రికార్డులు కొల్ల గొట్టాలని చూస్తున్నారు. పైగా పుష్ప కి పోటీగా వస్తున్న పలు సినిమాలు కూడా రిలీజ్ డేట్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నాయి. ఇక పుష్ప ది రూల్ సౌత్ నుండి ఒక్క హిందీ వెర్షన్ కే 500 కోట్ల టార్గెట్ తో రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. సినిమాకి కూడా అంత కెపాసిటీ ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్ తో హిందీలో ఏ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ అయిందో తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్, రష్మిక మందన్న కి చెందిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ కాగా, త్వరలో ఫహద్ ఫాజిల్ యొక్క భన్వర్ సింగ్ షెకావత్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు