Pushpa The Rule : పుష్ప రాజ్ ని మించి భన్వర్ సింగ్ షెకావత్..

Pushpa The Rule : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటైన ‘పుష్ప ది రూల్’ రిలీజ్ కి టైం దగ్గరపడుతున్న కొద్దీ అంచనాలు తారాస్థాయికి వెళ్తున్నాయి. మూడేళ్ళ కింద ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కి పదింతలు ఉండేలా ఈ సినిమా ఉండబోతుందని మేకర్స్ అంటున్నారు. అప్పట్లో కెజిఎఫ్ ని మించి పుష్ప ఉంటుందని బుచ్చిబాబు ఏ విధంగా అన్నాడో అదే రేంజ్ లో ఇప్పుడు పుష్ప ది రూల్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొదలుకొని, రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో సహా అన్నీ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలని పెంచేసాయి. ఇక ఈ సినిమా గురించి వస్తున్న ఒక్కో అప్డేట్ సినిమాపై క్యూరియాసిటీ ని మరింత పెంచేస్తున్నాయి. తాజాగా పుష్ప కి ధీటైన పాత్ర భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర గురించి వస్తున్న సమాచారం కూడా సినిమాపై హైప్ ని భారీగా క్రియేట్ చేస్తుంది.

పుష్ప ని మించిన షెకావత్ సార్..

టాలీవుడ్ కి లాక్ డౌన్ లో ఓటిటి సినిమాలతో పరిచయమైన ఫహద్ ఫాజిల్, దగ్గరయింది మాత్రం పుష్పతోనే. పుష్ప సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయమైన ఫహద్ ఫాజిల్ ఆ తరువాత పలు డబ్బింగ్ సినిమాల ద్వారా మన ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇక SP భన్వర్ సింగ్ షెకావత్ గా నున్నని గుండుతో, బయటికి కనిపించని క్రూరత్వాన్ని కళ్ళతోనే పలికించే పాత్రలో ఫహద్ ఎంతగా మెప్పించాడో మళ్ళీ చెప్పనక్కర్లేదు. నిజానికి పుష్ప కి రాజ్ కే ధీటైన పాత్రలో ఒక్క ఫైట్ కూడా లేకుండా మెప్పించాడు అంటే అర్ధం చేసుకోవచ్చు. అన్నిటికి మించి పార్టీ లేదా పుష్ప అంటూ ఫహద్ చెప్పే డైలాగ్ ఒక మీమ్ కంటెంట్ గా మారిపోయింది. అయితే పుష్ప ఫస్ట్ పార్ట్ లో తన క్యారెక్టర్ ని కేవలం అరగంట లోపు నిడివికే పరిమితం చేశాడు సుకుమార్. కథ ప్రకారం లేట్ ఎంట్రీ అయినా తన ఉనికిని చాటుకోవడంలో ఫహద్ సూపర్ సక్సెసయ్యాడు.

పుష్ప ది రూల్ లో షెకావత్ సర్ విధ్వంసం..

ఇక రాబోయే పుష్ప ది రూల్ (Pushpa The Rule) లో భన్వర్ సింగ్ ని ఏ రేంజ్ లో చూడబోతున్నారనేది ఉత్కంఠ గా మారింది. మేకర్స్ సన్నిహితుల సమాచారం మేరకు ఈసారి భన్వర్ సింగ్ షెకావత్ అసలు రూపం చూడబోతున్నారట. పుష్పరాజ్ చేతిలో భంగపడ్డ అనసూయ, సునీల్, ధనుంజయ్ లు ఒక ముఠాగా ఏర్పడి, రెండో పార్ట్ లో తోడుగా జగపతిబాబుని తెచ్చుకుంటారు. ఇక వీళ్ళను సమన్వయపరుస్తూ స్మగ్లింగ్ మాఫియాను వెనుక నుండి నడిపిస్తూనే పగతో రగిలిపోతున్న భన్వర్ సింగ్ అవకాశం దొరికినప్పుడంతా పుష్పని దెబ్బ కొడుతూనే ఉండేలా ఫహద్ పాత్ర ఉండబోతుంది. కొన్నిసార్లు అవి చాలా తీవ్రంగా ఉండి, ఈ క్లాష్ కు సంబంధించిన ఎపిసోడ్స్ మూవీకి కీలకం కాబోతున్నాయి. అందరి అంచనాలకు మించే పుష్ప వర్సెస్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ఉంటుందని టాక్. ఇక దర్శకుడు సుకుమార్ షాకింగ్ ఎలిమెంట్స్ చాలానే ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇక త్వరలోనే ఫహద్ ఫాజిల్ పై భన్వర్ సింగ్ పాత్ర పై ప్రత్యేకమైన టీజర్ కూడా రెడీ చేయిస్తున్నాడట సుకుమార్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు