SreeVishnu : మరోసారి సామజవరగమన పెయిర్..

SreeVishnu : టాలీవుడ్ లో కొందరు హీరోహీరోయిన్లు ఫస్ట్ కాంబినేషన్ తోనే ఆడియన్స్ కి మంచి పెయిర్ గా కనిపిస్తారు. ఆ సినిమాలు హిట్ అయినా ప్లాప్ అయినా ఆడియన్స్ దృష్టిలో వాళ్ళు మరో సినిమా చేయాలన్న కోరిక ఉంటుంది. ఇక హిట్ పెయిర్ అయితే ఇండస్ట్రీ మేకర్సే ఆ జోడీని రిపీట్ చేయాలనీ చూస్తారు. ఇక లాస్ట్ ఇయర్ అలా మంచి హిట్ పెయిర్ అనిపించుకున్న జోడీల్లో శ్రీ విష్ణు రెబా మోనికా జాన్ కూడా ఒకటి. లాస్ట్ ఇయర్ చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ “సామజవరాగమన”. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఈ సినిమా కామెడీ ప్రధానంగా తెరకెక్కగా ఈ చిత్రంలో హీరోయిన్ గా రెబా మోనికా జాన్ నటించింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోగా, లాంగ్ రన్ లో బాగా ఆడింది. ఇక వీళ్ళ పెయిర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా విజయంలో కూడా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రెబ్బ మోనికా కి కీలకంగా మారింది.

ఇంత వరకూ మళ్ళీ కనిపించలేదు..

ఇక సామజవరగమన లో హీరోయిన్ గా నటించిన రెబ మోనికా బెంగుళూరు కి చెందిన అమ్మాయి. ఈ హీరోయిన్ అంతకు ముందే తమిళ, మలయాళ భాషల్లో నటించినా అన్ని సైడ్ రోల్స్, సెకండ్ లీడ్ రోల్స్ వచ్చాయి. సామజవరాగమన సినిమాతో మెయిన్ హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుని పాస్ అయింది. అయితే ఇప్పటివరకు మళ్ళీ మరో తెలుగు సినిమాలో నటించలేదు ఈ అమ్మడు. కారణమేంటో తెలీదు గాని తెలుగులో కొన్ని ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసిందట. ఇక ఇప్పుడు మరో తెలుగు సినిమాలో నటించడానికి రెడీ అయింది రెబా మోనికా జాన్. అది కూడా శ్రీ విష్ణు సినిమాలోనే. త్వరలోనే ఈ సక్సెస్ ఫుల్ పెయిర్ రిపీట్ అవబోతుందని ఇండస్ట్రీ లో వార్తలు వస్తున్నాయి.

రెండో సారి హిట్ పెయిర్..

ఇక శ్రీ విష్ణు (SreeVishnu) లాస్ట్ ఇయర్ సామజరవరగమన తో బ్లాక్ బస్టర్ అందుకోగా, ఈ ఇయర్ ఓం భీం బుష్ తో మరో సక్సెస్ కొట్టాడు. ఇప్పుడు వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాజరాజచోరా ప్రీక్వెల్ లో స్వాగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక తాజాగా సుకుమార్ శిష్యుడు దర్శకుడు నిర్మించబోయే ఓ కొత్త చిత్రంలో శ్రీ విష్ణు రెబ మోనికా జాన్ జోడిగా నటించనున్నారట. దర్శకుడి పేరేంటో తెలీదు గాని, ఈ సినిమాను గుణ్ణం సందీప్ నిర్మించబోతున్నాడట. మరి ఆల్రెడీ టాలీవుడ్ లో మంచి హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు రెబ మోనికా రెండో సారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఇక శ్రీ విష్ణు ఇప్పటివరకు నివేదా పేతురేజ్ ని తప్ప రెండో సారి మరో హీరోయిన్ ని రిపీట్ చేయలేదు. ఇప్పుడు రెబా మోనికా తో జతకడుతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు