Gaami : ఓటిటి లో విశ్వక్ సేన్ మూవీ సెన్సేషన్..

Gaami : టాలీవుడ్ మహా శివరాత్రికి రిలీజ్ అయిన క్రేజీ సినిమాల్లో “గామి” మూవీ కూడా ఒకటి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా ఒక ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. దాదాపు నాలుగేళ్ళ పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా రిలీజ్ కి నెల ముందు వరకు కూడా గామి సినిమా గురించి చాలా మందికి తెలీదు. కేవలం అప్పటికప్పుడు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం వల్ల ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక పెయిడ్ ప్రీమియర్ల ద్వారా వచ్చిన మౌత్ టాక్ తో మంచి ఓపెనింగ్స్ సాధించిన గామి డీసెంట్ హిట్ గా నిలిచింది. ఫాంటసీ కథని జోడించి తీసిన ఈ సినిమా మంచి టాక్ తో పాటు సాలిడ్ ఓపెనింగ్స్ ని కూడా దక్కించుకుందన్న విషయం తెలిసిందే. దర్శకుడు విద్యాధర్ ఆరేళ్ళ పాటు కష్టపడి ఈ సినిమాని తెరకెక్కించానని చెప్పగా, బాక్స్ ఆఫీస్ దగ్గర ఇతర సినిమాల పోటీగా ఉండడంతో, పైగా బోర్డు ఎగ్జామ్స్ సీజన్ వల్ల లాంగ్ రన్ లో అంతగా ఆడలేదు. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కి ఓ రెండు కోట్లు ఎక్కువ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది.

ఓటిటి లోనూ సూపర్ రెస్పాన్స్..

ఇక గామి సినిమాలో అన్నిటికీ మించి మహాశివరాత్రి కి వచ్చిన ఈ సినిమాలో శివుడికి చెందిన రిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి, ఆడియన్స్ కూడా గామి సినిమా చూడ్డానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఇక ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని సొంతం చేసుకున్న గామి సినిమా మరీ ఎక్స్ పెర్టేషన్స్ ను పూర్తిగా అందుకోక పోయినా కూడా ఉన్నంతలో సినిమా బాగానే ఆకట్టుకోవడంతో బ్రేక్ ఈవెన్ ని అందుకుని తర్వాత స్లో అయినా డీసెంట్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. కాగా గామి సినిమా బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయిన తర్వాత రీసెంట్ గా సినిమా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. జీ 5 యాప్ లో సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఇక్కడ సాలిడ్ గా వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. రెస్పాన్స్ కూడా బాగానే ఉండగా వ్యూవర్ షిప్ మాత్రం సూపర్ సాలిడ్ గా దూసుకు పోతూ డిజిటల్ లో రిలీజ్ అయిన 72 గంటల్లో ఓవరాల్ గా 50 మిలియన్ వన్ మినట్ మ్యాచ్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం.

ఓటిటి ద్వారా ఎక్కువ మందికి రీచ్..

ఇక థియేటర్లలో మిస్ అయిన గామి(Gaami) ని చూడలేని ప్రేక్షకులు ఓటిటి లో బాగా కనెక్ట్ అయ్యారు. పైగా దీని ద్వారా ఎక్కువ మందికి రీచ్ వస్తుంది. ఇక డిజిటల్ లో త్వరలోనే 100 మిలియన్ 1 మిలియన్ వ్యూస్ మార్క్ ని సినిమా అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వండర్స్ ను క్రియేట్ చేస్తుంది అనుకున్నా మొత్తం మీద పర్వాలేదు అనిపించే రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమా, డిజిటల్ లో మాత్రం సాలిడ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంటూ ఉండగా లాంగ్ రన్ లో డిజిటల్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి. ఇక విశ్వక్ నెక్స్ట్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి చిత్రంతో రానుండగా ఆ సినిమా మే 17న రిలీజ్ కి రెడీ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు