Heeramandi : థియేటర్లో ఒక్కరే హీరో.. ఓటిటి లో అందరూ హీరోలే – అదితిరావు హైదరి

Heeramandi : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరు అదితిరావు హైదరి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈమె తెలుగులో సమ్మోహనం చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. అయితే బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ అయింది. ఇటీవల హీరో సిద్ధార్థ్ ని రహస్యంగా పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఓటీటీ అందుబాటులోకి వ‌చ్చాక ఎంట‌ర్టైన్మెంట్ తీరు మారిన సంగ‌తి తెలిసిందే. థియేట‌ర్ కే వెళ్లి చూడాలి? అనేమీ లేదు. థియేట‌ర్ కాక‌పోతే ఓటీటీ అనే ఆప్ష‌న్ ఇప్పుడు తయారయింది. థియేటర్లలో మిస్ అయినవారు చాలా మంది అప్పుడు ఓటిటి లో చూసుకుందామ‌నే లెక్క‌లోకి జ‌నాలు వ‌చ్చేసారు. ఇప్పుడు జనాల మైండ్ సెట్ అలాగే తయారయిందని అనిపిస్తుంది.

థియేటర్లో ఒకరే హీరో.. ఓటిటి లో అందరూ హీరోలే..

ఇక ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే త‌గ్గ‌ట్టే ఓటీటీ ఎంతో మంచి క్వాలిటీ కంటెట్ ని అందిస్తుంది. సినిమాల కంటే గొప్ప ఎంట‌ర్ టైన్ మెంట్ ఓటీటీలో నే దొరుకుతుంద‌న్న వాద‌న గ‌ట్టిగానే వినిపిస్తుంది. డాక్యుమెంట‌రీలు.. వెబ్ సిరీస్ లు, ఇలా కొత్త త‌ర‌హా ఎంట‌ర్టైన్మెంట్ ఓటీటీలో దొరుకుతుంది. న‌వ‌త‌రం ప్ర‌తిభావంతులు వాటి ద్వారా వెలుగులోకి వ‌స్తున్నారు. పైగా రోజురోజుకి ఓటీటీ అంతంకంత‌కు అప్డేట్ అవుతుంది. దాంతో పాటు ఆద‌ర‌ణ కూడా రెట్టింపు అవుతుంది. తాజాగా ఓటీటీ ఛానెల్స్ ని ఉద్దేశించి టాలెంటెడ్ బ్యూటీ ఆతిది రావు హైద‌రీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. డిజిట‌ల్ ప్లాట్ ఫాం అందుబాటులోకి వ‌చ్చాక న‌టీన‌టులు ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సినిమాలే చేయాలి అన్న నిబంధ‌న తొల‌గిపోయింది. ఒక‌ప్పుడు సినిమా అనేది బ‌లంగా క‌నిపించేది. కానీ ఇప్పుడా ప్ర‌భావం పెద్ద‌గా లేదు. సినిమా లేక‌పోతే ఓటీటీ ఆప్ష‌న్ ఉందిగా అన్న ధీమా క‌నిపిస్తుంది. థియేట‌ర్లో వ‌చ్చే సినిమాలో ఒక్క‌రే హీరో ఉంటారు. కానీ ఓటీటీలో అంతా హీరోలే. ఎవ‌రికి వారే హీరో పాత్ర‌లు పోషిస్తుంటారని అంది.

రెండూ ఇష్టమే..

ఇక ఓటిటి, థియేటర్స్ గురించి అదితి రావు మాట్లాడుతూ తనకు ఈ రెండు మాధ్య‌మాలు ఇష్ట‌మే, కానీ సినిమాల‌కంటే ఓటీటీలోనే మంచి కంటెంట్ అందుబాటులో ఉంటుంది అన్న‌ది వాస్త‌వమని అదితి వ్యాఖ్యానించింది. అలాగే వ్య‌క్తిగ‌తంగా ఓటీటీ కంటెట్ కి బాగా క‌నెక్ట్ అవుతున్నానని, ఇవి ప్రేక్ష‌కుల్ని ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తున్నాయని అదితి అన్నది. అలాగే తాను నటించిన ‘హీరామండి’ (Heeramandi) సిరీస్ గురించి మాట్లాడుతూ త్వ‌ర‌లో ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది, మంచి సిరీస్ ఇది. వాస్త‌వ జీవితాల్ని ప్ర‌తిబింబిస్తుంది. నా అభిమాన ద‌ర్శ‌కుడు కూడా సంజ‌య్ గారి ఆయ‌న సినిమాలో పాత్ర‌లు ఎంతో బ‌లంగా క‌నిపిస్తాయి. అలాంటి పాత్ర‌లు సృష్టించ‌డం ఆయ‌న‌కే సాధ్య‌మైంది. ఇక ఆల్రెడీ అదితిరావు సంజయ్ లీలా డైరెక్షన్ లో ‘ప‌ద్మావ‌త్’ లో న‌టించగా, మ‌ళ్లీ ఆయ‌న‌తో హీరమండిలో పనిచేసింది. ఇప్పుడు మరో అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నానని అదితి వ్యాఖ్యానించింది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు