Heeramandi Trailer : దేశంకోసం వేశ్యల పోరాటం..

Heeramandi Trailer : బాలీవుడ్ లో ఆడియన్స్ మెచ్చేలా తీసే అతి తక్కువ టాలెంటెడ్ దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ఆయన తీసే ప్రతి సినిమా కళాత్మకంగా ఉంటుంది. కమర్షియల్ అయినా, హిస్టారికల్ అయినా సంజయ్ లీల భన్సాలీ సినిమాలో చూపించే భారీతనం, ఆయన మార్క్ ఎమోషన్స్, డ్రామా బాలీవుడ్ లో ఏ దర్శకుడూ తీయలేడని చెప్పాలి. ఇక సంజయ్ లీలా భన్సాలీ చివరగా గంగూభాయ్ కథియా వాడి సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. అయితే తాజాగా సంజ‌య్ లీలా భాన్సాలీ తెర‌కెక్కిస్తున్న తాజా భారీ ఎపిక్ సిరీస్ ‘హీరామండి’. ఇక రెండేళ్ల నుండి హీరమండి రాక కోసం సినీ ప్ర‌పంచ‌మంతా ఆస‌క్తిగా వేచి చూస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ మే 1 నుండి ప్రేక్షకులను అల‌రించ‌నుంది. ఇక తాజాగా మోస్ట్ అవైటెడ్ హీరామండి ట్రైల‌ర్ విడుద‌లైంది. రిలీజ్ అయిన కాసేపటికే సోషల్ మిడియా లో ట్రెండింగ్ లోకి వచ్చిన ఈ ట్రైల‌ర్ ప్రేక్షకులని ఎంతో ఆకట్టుకుంటుంది.

భన్సాలీ మార్క్ లో..

ఇక హీరామండి ట్రైలర్ (Heeramandi Trailer) రిలీజ్ అయ్యాక ఒక్క మాటలో చెప్పాలంటే మరోసారి సంజయ్ లీలా భన్సాలీ మార్క్ సినిమా చూడబోతున్నారని తెలుస్తుంది. ఆద్యంతం భ‌న్సాలీ శైలి క‌ళాత్మ‌క‌త‌, స్టైల్ మెరుపులు ర‌క్తి క‌ట్టించాయి. భారీ త‌నం నిండిన కోటలు, ప్రాకారాలు, హీరామండి డైమండ్ బ‌జార్ యాంబియెన్స్, దాంతో పాటు అక్క‌డి రాజ‌కీయాలు, కుట్ర‌లు వ‌గైరా విష‌యాల‌ను ఈ సిరీస్ లో చూపించార‌ని తెలుస్తుంది. ఇక ట్రైలర్ లో వీక్షకులను వేశ్య‌లు కొలువుండే హీరామండి ఊరుకు అలా తీసుకువెళుతుంది. ఇక అక్కడ ఒక ప‌వ‌ర్ ఫుల్ లేడీ మల్లికాజాన్ వేశ్యల గృహాన్ని పాలిస్తుంది. ఇక ట్రైలర్ లో తన కూతుర్లు ఫరీదాన్, అలాగే బిబ్బోజాన్ స్వాతంత్య్ర‌ పోరాటంలో చేరి బ‌హిరంగంగా బ్రిటీష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం కావాలని విప్లవకారులతో క‌లిసి డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో మల్లికాజాన్ చిన్న కుమార్తె అలంజేబ్, ఒక నవాబ్ కొడుకు తాజ్దార్ తో ప్రేమ క‌ల‌ల్ని కంటూ, అలంజేబ్ హీరామండి నుండి బయటపడాలని కోరుకుంటుంది. ఇక దేశ ద్రోహుల మ‌ధ్య నివాసం పోరాటం, వేశ్యావాటిక‌ల్లో నిషేధించిన కోరికలు సామాజిక నిబంధనల‌తో ఆమె వివాహం సాధ్య‌ప‌డ‌దు. అదే స‌మ‌యంలో భారతదేశం స్వాతంత్య్ర కోసం పోరాటాలు చేసే స్థాయికి వస్తుంది. ఈ క్రమంలో మల్లికాజాన్- ఫరీదన్‌లు హీరమండి హుజూర్ లేదా హక్కు కోసం పోరాటంలో బంధిఖానాలోకి వెళ‌తారు. చివరకు వీట‌న్నిటీనీ ఎదుర్కొని హీరామండిలో ఎవరు రాజ్యమేలుతారు? అనేదే కాన్సెప్ట్.

ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో మే 1నుండి..

ఇక హీరామండి ట్రైలర్ రిలీజ్ కి ముందు దీన్ని సినిమా గా తీస్తున్నారని చాలా మంది అనుకున్నారు. కానీ ఇది ఒక సిరీస్ లా తీసారని ట్రైలర్ రిలీజ్ అయ్యాక తెలిసింది. ఇక ఈ సినిమా దర్శకుడు సంజయ్ లీలా భ‌న్సాలీ ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ ప్రేమ, అధికారం, స్వేచ్ఛ కోరుకునే చోట‌ అసాధారణమైన మహిళలు, వారి కోరికలు, పోరాటాలకు సంబంధించిన‌ కథాంశం తో హీరమండి తెరకెక్కిందని చెప్పగా, తమ సిరీస్‌ను ప్రజలు ఎంతో ఆదరిస్తారని ఆకాంక్షించాడు. ఇక సంజయ్ లీలా భన్సాలీ కి మొదటి సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్ ఇది. సంజయ్ లీలా భ‌న్సాలీ భారతదేశం అంతటా, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసే అభిరుచి గల ద‌ర్శ‌కుడు. ప్ర‌తి ఒక్క‌రి భావోద్వేగాలు లీనమయ్యే ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఇప్పుడు ఈ సిరీస్ తో కూడా అలరించే అవకాశం ఉంది. ఇక ఈ సిరీస్ ను భన్సాలీ స్వీయనిర్మాణంలో తెరకెక్కించగా, ఈ సిరీస్ లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి, రిచా చద్దా, తహ్ షా బాదుషా, ఫర్దీన్ ఖాన్, ఆద్యాన్ సుమన్, శేఖర్ సుమన్ లు ప్రధాన పత్రాలు పోషించారు. మే 1నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు