Venkatesh : వెంకీ మామ, అనిల్ రావిపూడి మూవీ ఇలా ఉండబోతుందా?

Venkatesh : విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి ‘సైందవ్’ తో ఆడియన్స్ ని పలకరించిన విషయం తెలిసిందే. అయితే భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా ప్లాప్ అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా భారీ హిట్టు కొట్టాలని ఫిక్స్ అయ్యారు. అందుకే తన కు అచ్చోచ్చిన జోనర్ అయిన ఎంటెర్టైన్మెంట్ జోనర్ లోనే ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ వెంకటేష్ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడనే వార్తలపై గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్, అలాగే అనుదీప్ తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చినా, ఫైనల్ గా అనిల్ రావిపూడి తో సినిమా ఉండబోతుందని కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక వెంకీ మామ, అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటే అందరికీ నవ్వుల పువ్వులు గుర్తొస్తాయి. ఇంతకు ముందు వీరి కాంబో లో ఎఫ్ 2, ఎఫ్ 3 సిరీస్ కామెడీ డ్రామాలు ఏ రేంజ్ లో ఆడియన్స్ ని నవ్వించారో తెలిసిందే. మామూలు అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాలు బయ్యర్లకు భారీ లాభాలని అందించాయి.

హ్యాట్రిక్ కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం..

ఇక వెంకీమామ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ సారి ఆ నవ్వులు మాత్రమే కాకుండా సీరియస్ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లేట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ ని తెలియచేస్తూ తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేసారు మేకర్స్. ఇక అందులో ‘ఓ ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సెలెంట్ వైఫ్, ఈ ముగ్గురి మధ్య ఓ క్రైమ్ ఎంటర్టైనర్ అని చెప్పుకొచ్చారు. ఓవరాల్ గా స్టోరీ లైన్‌ ఇలా ఉంటుందని మేకర్స్ ముందే హింట్ ఇచ్చేశారు. క్రైమ్ అని చెప్పడం, ఎంటర్టైన్ అని చెప్పడంలోనే అనిల్ రావిపూడి మార్క్ మిస్ అవ్వదని అర్థం అవుతోంది.
మరి ఈ ఎక్స్ కాప్ జీవితంలో జరిగింది ఏంటి? ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? తన భార్య ఎవరు? అసలు ఈ క్రైమ్ ఎంటర్టైనర్‌లో ఏం జరగబోతోంది? అన్నది ఇప్పుడు ఇంట్రెస్ట్‌గా మారింది.

దిల్ రాజు నిర్మాణంలో..

ఇక వెంకీ మామ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా దిల్ రాజు తనకు కలిసి వచ్చిన సంక్రాంతి సీజన్‌లో సినిమాను దించాలని ఫిక్స్ అయ్యాడు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించేశారు కూడా. ఉగాది సందర్భంగా రివీల్ చేసిన ఈ అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో బాగానే సందడి చేస్తోంది. ఇక అనిల్ రావిపూడి వెంకీ కాంబోలో వచ్చిన ఎఫ్ 2 తో దిల్ రాజు భారీ లాబాల్ని అందుకున్నాడు. ఆ టైంలో వరుస ఫ్లాపులతో ఉన్న దిల్ రాజుకి ఈ మూవీని ఉపశమనం ఇచ్చింది. అయితే ఎఫ్ 2 రేంజ్‌లో ఎఫ్ 3 ఆడలేదు గాని యావరేజ్ గా నిలిచింది. మరి ఇప్పుడు అనిల్ రావిపూడి కొత్త జోనర్, కొత్త కథను ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ హ్యాట్రిక్ కాంబోలో రాబోయే సినిమా ఎలాంటి అంచనాలను అందుకుతుందో చూడాలి మరి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు