Anil Ravipudi: అనిల్ రావిపూడిలో ఇంత మార్పా..తండ్రి విషయంలో..!

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఒకరు.. ఈ డైరెక్టర్ ప్రకాశం జిల్లాలోని చిలుకూరి వారి పాలెం లో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి కూడా వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అనిల్ రావుపూడి ఈరోజు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ గా కూడా పేరు సంపాదించారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. చిన్నతనంలోనే తన తండ్రి తమ కోసం ఎన్నో కష్టాలను పడ్డారని తెలిపారు.

ఎన్ని కష్టాలు వచ్చినా సరే తనను చదివించడం కోసం తన తండ్రి పడ్డ తాపత్రయం ఇప్పటికీ తమ కళ్ళముందు మెదులుతూ ఉంటుందంటూ తెలియజేశారు అనిల్ రావుపూడి. మొదట్లో తన తండ్రి ఒకపక్క వ్యవసాయం చేస్తూనే .. మరోపక్క ఆర్టీసీ లో ఉద్యోగం రావడంతో అక్కడ కూడా పనిచేశారని.. దాదాపుగా 15 నుంచి 20 గంటల పాటు డ్యూటీ చేసేవారని తెలిపారు.. కేవలం 4000 రూపాయల జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారని , చాలీచాలని జీతంతో ఎన్నో కష్టాలను అనుభవించామంటూ తెలిపారు.

అనిల్ రావిపూడి చిన్నతనం మొత్తం కూడా అద్దంకిలో గడిపేసారట. ఆ తర్వాత ఇంజనీరింగ్ చేయాలని 45 వేల రూపాయల పేమెంట్ సీట్ కట్టి మరీ జాయిన్ అయ్యానని తెలిపారు. అయితే అప్పట్లో 45 వేల రూపాయలు అంటే చాలా కష్టం కావడం చేత తన తండ్రి కేబుల్ టీవీ కనెక్షన్ ఇవ్వటాన్ని పార్ట్ టైం జాబ్ గా చేశారని.. ఒకపక్క వ్యవసాయం మరొక పక్క కేబుల్ టీవీ పనులు.. ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం ఇలా అన్ని ఇబ్బందులను తన తండ్రి ఎదుర్కొన్నారని తెలిపారు.

- Advertisement -

అయితే ఇంజనీరింగ్ పూర్తి చేసి తన తండ్రి కోరిక తీర్చానని తెలిపారు.. ఇకపోతే ఉద్యోగం చేసి కుటుంబానికి చేదోడుగా ఉంటారని అందరూ అనుకున్నారు.. కానీ ఈయన మాత్రం తన బాబాయ్ అరుణ్ ప్రసాద్ లాగే ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారు.. గతంలో అనిల్ రావిపూడి బాబాయ్ అరుణ్ ప్రసాద్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాకి డైరెక్టర్గా పనిచేశారు.. అలా అరుణ్ ప్రసాద్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్నేళ్లు పనిచేశారట అనిల్ రావుపూడి. ఎన్నో చిత్రాలకు రచయితగా మారి మాటలు రాసి చివరికి పటాస్ సినిమాతో డైరెక్టర్ గా మారారు.. అప్పటినుంచి తన కెరీర్ సక్సెస్ఫుల్గా మారింది.. చివరిగా భగవంత్ కేసరి సినిమా తో మరో విజయాన్ని అందుకున్నారు అనిల్ రావుపూడి. డైరెక్టర్ రాజమౌళి తర్వాత సక్సెస్ఫుల్గా నిలబడ్డ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి కూడా ఉన్నారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు