Niharika : నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా ?

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన చాలామంది నటీనటులు స్టార్లుగా మారిపోయారు. ముఖ్యంగా మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన వారిలో హీరోలు ఎక్కువగా ఉండటం మనం చూస్తాం. కానీ హీరోయిన్గా నాగబాబు కూతురు కొణిదల నిహారిక మాత్రమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు.

అయితే… నిహారిక వివాహం గత మూడు సంవత్సరాల కింద జరిగిన సంగతి తెలిసిందే. వెంకట చైతన్యతో.. సాంప్రదాయ పద్ధతిలో రాజస్థాన్లో నిహారిక పెళ్లి చేశారు నాగబాబు. కానీ వీరిద్దరూ రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని కొన్ని రోజులు దాచిన తర్వాత బయటపడింది. దీంతో ప్రస్తుతం నిహారిక వెబ్ సిరీస్ లో యాక్టింగ్ చేస్తూ… అలాగే నిర్మాతగా కొనసాగిస్తున్నారు. అలాగే తరచూ సోషల్ మీడియాలో తన హాట్ అందాలను అరబోస్తూ నెటిజెన్స్ ను మెప్పిస్తున్నారు.

అయితే ఆమె విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక రెండవ వివాహం చేసుకుంటుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. యూట్యూబర్ ప్రేమలో పడిందని కూడా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా నిహారిక చేసిన పోస్టు వైరల్ గా మారింది. నీకు కావాల్సింది ప్రేమ… బీచ్ మాత్రమే అంటూ తాజాగా నిహారిక పోస్టు పెట్టింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెట్టిజెన్స్ ఆమెపై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. నిహారిక ప్రేమలో పడిందని.. త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతుందని అందుకే ఇలాంటి మెసేజ్లు పెడుతుందని చెబుతున్నారు నెటిజన్స్.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు