Indian2 : క్లైమాక్స్ లో భారీ సర్ప్రైజ్ ఇవ్వనున్న మేకర్స్..!

Indian2 : కోలీవుడ్ స్టార్ లోక నాయకుడు కమల్ హాసన్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు2 (ఇండియన్2) షూటింగ్ తుది దశలో ఉంది. ఈ సినిమా పాతికేళ్ల కింద వీరిద్దరి కాంబోలోనే వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నాలుగేళ్ళ కిందటే మొదలైనా, షూటింగ్ పలు కారణాల వల్ల ఆగిపొయి మళ్ళీ పట్టాలెక్కింది. తీరా ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకునేసరికి మళ్ళీ ఏవో ఒక అవంతరాలు వస్తున్నాయి. అయినా పట్టు వదలకుండా శంకర్ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే భారతీయుడు 2 సినిమా ట్రైలర్ గాని, పాటలు గాని ఇప్పటివరకు మళ్ళీ రిలీజ్ అవలేదు. ఇక రిలీజ్ డేట్ జూన్ 13న అనుకున్నా మళ్ళీ జులై కి షిఫ్ట్ చేసారని తెలుస్తుంది. సినిమా రిలీజ్ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడగా, ఇంకా వాయిదా వేసుకుంటూ పోతే సినిమాపై ఉన్న అంచనాలు తగ్గిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా రానున్న నెలరోజుల్లోగా ఇండియన్2 షూటింగ్ మొత్తం పూర్తి చేసి, ప్రమోషన్లపైనే మొత్తం ఫోకస్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇండియన్ 2 నుండి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.

క్లైమాక్స్ లో సప్రైజ్..!

ఇక శంకర్ దర్శకత్వంలో ఇండియన్2 షూటింగ్ పూర్తవగానే గేమ్ ఛేంజర్ షూటింగ్ మొదలవుతుందని అందరికి తెలిసిందే. అయితే ఇండియన్ 2 కి మూడో భాగం కూడా తెరకెక్కుతోందని చాలా మందికి తెలీదు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ గా మారాయి. ఇండియన్2 చిత్రానికి మూడో భాగం కూడా ఉండబోతోందని ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం పార్ట్‌ 2 తో పాటే మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఈ రెండు సినిమాలను ఈ ఏడాదిలోపే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు టాక్. అయితే ఈ మూవీ టీమ్‌ మరో భారీ సర్‌ప్రైజ్‌ ను కూడా ప్లాన్ చేసింది. పార్ట్‌ 2 క్లైమాక్స్ లో మూడో భాగం ట్రైలర్‌ను ప్రదర్శించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పైగా అదే రోజున పార్ట్‌ 3 విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారట. ఇక ఇండియన్2 సినిమా విడుదల తేదీని జులై 12కు వాయిదా వేసినట్లు సమాచారం.

Shankar will give a surprise in Indian 2 movie climax

- Advertisement -

ఇండియన్2 రిలీజ్ అయ్యాకే గేమ్ ఛేంజర్ పై ఫోకస్?

ఇక ఇండియన్2 (Indian2) సినిమా వల్లే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వాయిదా పడుతూ వస్తుందని అందరికి తెలిసిందే. పైగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంపైనే శంకర్ పై గుర్రుగా ఉన్నారు. కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఇండియన్ 2 రిలీజ్ అయ్యాకే గేమ్ ఛేంజర్ పై ఫోకస్ పెడతాడని టాక్. ఇది ఒక రకంగా మంచిదే అయినా, ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది గేమ్ ఛేంజర్ లాస్ట్ ఇయర్ సమ్మర్ లో రావాల్సిన సినిమా ఇంతవరకు రిలీజ్ కాలేదంటే చరణ్ ఫ్యాన్స్ కి చాలా కోపం వస్తుంది. ఈ క్లారిటీ ఇచ్చి ఉంటె, బహుశారామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా షూటింగ్ కాస్తైనా పూర్తి చేసేవాడని నెటిజన్ల అభిప్రాయం. ఏది ఏమైనా ఇండియన్ 2 జులై లోపు రిలీజ్ అయితే చాలా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు