Pushpa 2 : బన్నీ ఫ్యాన్స్ కి షాక్.. డిసెంబర్లో రిలీజ్ ..!

Pushpa 2.. సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే తమ అభిమాన హీరో సినిమా కోసం వేయికళ్లతో అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు.. అది పాన్ ఇండియా చిత్రం ఐతే ఇంకాస్త ఎక్కువ అని చెప్పాలి.. అయితే ఒక సమయానికి వస్తుందని నిర్మాతలు చెప్పిన తర్వాత.. ఆ సమయానికి సినిమా విడుదల చేయకపోతే మాత్రం వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది.. ఆగస్టు 15వ తేదీన సినిమాను విడుదల చేస్తామంటూ భారీ ఎత్తున ప్రచారాలు నిర్వహించిన చిత్ర బృందం.. ఇప్పుడు విడుదల తేదీకి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో సినిమా తేదీని వాయిదా వేస్తూ డిసెంబర్లో రిలీజ్ చేస్తామంటూ ఒక వార్త తెరపైకి తీసుకురావడం అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

పుష్ప -2 ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం పుష్ప 2.. బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తూ ఉండగా.. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. అంతేకాదు ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ గా నిలిచాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతోంది. పైగా దర్శకుడు సుకుమార్ ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారట.. ఇందులో యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రీ నటిస్తున్నట్లు సమాచారం.

పుష్ప 2 రిలీజ్ డేట్ వాయిదా..

Pushpa 2 : Shock for Bunny fans.. Released in December ..!
Pushpa 2 : Shock for Bunny fans.. Released in December ..!

ఇకపోతే ఈ సినిమాని మేకర్స్ ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.. ఇప్పుడు సినిమా షూటింగ్ ఇంకా మిగిలి ఉండడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ సినిమా రిలీజ్ ఆగస్టులో వాయిదా పడితే డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. ఎందుకంటే సెప్టెంబర్ లో దేవర, అక్టోబర్లో గేమ్ ఛేంజర్ సినిమాలు విడుదల కానుండడంతో.. ఈ సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఈ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

- Advertisement -

పుష్ప -2 తారాగణం..

ఇక ఇందులో నటిస్తున్న నటీనటుల విషయానికి వస్తే.. పుష్ప సినిమాలో నటించిన వారు ఇందులో కంటిన్యూ అవుతున్నారని సమాచారం… ముఖ్యంగా అనసూయ, సునీల్ , ఫహద్ ఫాజిల్ లాంటివారు మళ్లీ ఈ సినిమాలో కంటిన్యూ అవుతున్నారట.. ఈ సినిమా కోసం యావత్ దేశం ఎంతగానో ఎదురుచూస్తోంది. మరో రెండు నెలల్లో విడుదల తేదీన పెట్టుకొని ఇప్పుడు ఇలాంటి వార్తలు రావడంతో చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలి.. అయితే ఇందులో నిజానిజాలు తెలియకపోయినా అభిమానులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు