Thug Life : థగ్ లైఫ్ షూటింగ్ కి బ్రేక్… సెట్లో ప్రమాదం, స్టార్ హీరోకి తీవ్ర గాయం

Thug Life : ఉలగనాయగన్ కమల్ హాసన్ పాన్ ఇండియా మూవీకి బ్రేక్ పడింది. తాజాగా ఈ మూవీ సెట్లో ప్రమాదం చోటు చేసుకోగా, ఓ స్టార్ హీరోకు కాలు విరిగినట్టు సమాచారం. అసలు ప్రమాదం ఎలా చోటు చేసుకుందో తెలుసుకుందాం పదండి.

గాయపడ్డ స్టార్ హీరో

మలయాళ నటుడు జోజు జార్జ్ ప్రస్తుతం కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్‌ సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడే ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సినిమా సెట్‌లో హెలికాప్టర్ షాట్ లో జోజు ప్రమాదానికి గురయ్యాడు.

ప్రమాదం ఎలా జరిగిందంటే?

ప్రస్తుతం థగ్ లైఫ్ మూవీ షూటింగ్ పుదుచ్చేరిలో జరుగుతోంది. అక్కడ సినిమాలోని హై ఆక్టెన్ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తోంది చిత్రబృందం. ఇందులో సినిమాలో నటిస్తున్న ప్రముఖ స్టార్స్ అంతా పాల్గొంటున్నారు. ఇక సినిమా షూటింగ్‌ జరుగుతుండగా, అందరూ హెలికాప్టర్ షాక్ కు రెడీ అయ్యారు. అందులో భాగంగానే జోజు హెలికాప్టర్ నుండి దూకే సీన్ ను షూట్ చేయాల్సి ఉంది డైరెక్టర్. డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే జోజు మరో ప్రముఖ నటుడు నాజర్‌తో కలిసి హెలికాప్టర్ నుండి దూకాలి. అయితే జోజు ప్రమాదవశాత్తూ హెలికాప్టర్ నుంచి దుకకుండానే జారీ పడిపోయాడు. దీంతో అతని ఎడమ పాదం ఫ్రాక్చర్ అయినట్టు సమాచారం.

- Advertisement -

Joju George injured during high-stakes helicopter scene in Mani Ratnam's Thug Life | Tamil News - The Indian Express

ఈ దిగ్భ్రాంతికర సంఘటన నుంచి త్వరగానే తెరుకున్న చిత్రబృందం ఆయనను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారట. సమాచారం ప్రకారం వైద్యులు జోజును ఒక వారం పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారట. కానీ జోజు మాత్రం తన వల్ల మూవీ షూటింగ్ ఆగిపోవద్దు అన్న ఉద్దేశంతో పుదుచ్చేరిలో షూట్‌ను కొనసాగించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడ్డ ఈ మూవీ షూటింగ్ ఇప్పుడిప్పుడే పుంజుకుని వేగంగా చిత్రీకరణను పూర్తి చేసుకుంటోంది. ఇలాంటి టైమ్ లో జోజు గాయపడడంతో మరో అడ్డంకి ఏర్పడింది. మరి జోజు లేకుండానే మేకర్స్ షూట్ ప్లాన్ చేస్తారా? లేదంటే షూటింగ్ కు గ్యాప్ ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంపై మేకర్స్ ఇంకా అఫిషియల్ గా స్పందించలేదు. కానీ జోజు అభిమానులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. అలాగే స్టార్స్ ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు.

20 ఏళ్ల తరువాత కాంబో రిపీట్

పాన్ ఇండియా మూవీ థగ్ లైఫ్ కు మణిరత్నం దర్శకత్వం వహిస్తుండగా, కమల్ హాసన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. థగ్ లైఫ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా కాగా, ఈ మూవీ కోసం కమల్ హాసన్ స్వయంగా స్క్రిప్ట్‌ రాశారు. ఈ చిత్రంలో సిలంబరసన్ టిఆర్, త్రిష కృష్ణన్, అభిరామి, నాజర్, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా దాదాపు రెండు దశాబ్దాల తరువాత కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న సినిమా థగ్ లైఫ్. 1987లో విడుదలైన క్లాసిక్ మూవీ నాయకన్ తర్వాత కమల్ హాసన్, మణిరత్నం చేస్తున్న మొదటి సినిమా ఇదే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు