Akhil Akkineni: అయ్యగారి ప్లాన్ ఈ సారైనా వర్కౌట్ అవుతుందా..?

అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని చివరిగా ఏజెంట్ సినిమాలో నటించి బొక్క బోర్ల పడ్డారనే చెప్పాలి.. వాస్తవానికి అందం ,నటన , బాడీ ఇలా అన్నీ ఉన్నా కూడా అఖిల్ కి ఇప్పటివరకు సరైన హిట్ మాత్రం రాలేదు. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా.. ఎంత కొత్త కథతో సినిమా తీస్తున్నా కూడా రిజల్ట్ మాత్రం శూన్య . ఎన్నో ఆశలతో ఎంతో కష్టపడి దాదాపు మూడు సంవత్సరాలు పాటు ఏజెంట్ సినిమా కోసం పని చేశారు. కానీ సినిమా మాత్రం అతిపెద్ద డిజాస్టర్ అయింది.. ఈ దెబ్బకి అఖిల్ కాస్త గ్యాప్ తీసుకొని ప్రస్తుతం చిల్ అవుతున్నారు. అయితే ఈ సినిమా సమయంలోనే అఖిల్ ఒక ప్రాజెక్టు ప్రకటించగా.. ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన తాజాగా ఒక అప్డేట్ విడుదల చేశారు.

అనిల్ కుమార్ అనే ఒక కొత్త దర్శకుడుతో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం చేసేందుకు అఖిల్ అక్కినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును గత ఏడాది ప్రారంభించాలనుకున్నప్పటికీ కొన్ని కారణాలవల్ల ఆలస్యం అయింది.. అయితే ఇప్పుడు అఖిల్ – అనిల్ కుమార్ కలిసి ఈ కథ ఫైనల్ డ్రాఫ్ట్ కోసం తెగ కష్టపడుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ మూవీ డైలాగ్ అధికారికంగా లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాలని అఖిల్ ప్రయత్నిస్తున్నారు.. అయితే ఈ చిత్రం కోసం ఏకంగా రూ.80 కోట్లు ఖర్చు పెడుతున్నారు.. యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్మించబోతోంది అని తెలుస్తోంది. అందుకే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పక్కా అయిన తర్వాతనే ఫీల్డ్ లోకి దిగాలని అఖిల్ అనుకుంటున్నారు..

ప్రస్తుతం ప్రధాన నటీనటులు సాంకేతిక నిపుణులను ఫైనలైజ్ చేస్తున్నారట. మార్చి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ అప్డేట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈయన ఖాతాలో ఒక్క భారీ విజయం కూడా లేదు.. కనీసం ఈ సినిమాతో నైనా సక్సెస్ అవుతారో లేదో చూడాలి. మరోవైపు డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ సినిమా ఆడియన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడానికి సురేందర్ రెడ్డి కారణంగా అక్కినేని అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు..

- Advertisement -

వాస్తవానికి ఇప్పటివరకు సురేందర్ రెడ్డి తన కెరియర్ లో తీసిన చాలా సినిమాలకు మంచి రెస్పాన్స్ లభించింది.. వాటిలో కిక్ , రేసుగుర్రం, ధ్రువ వంటి చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. అయితే అఖిల్ తో కష్టపడి తీసిన ఏజెంట్ మాత్రం సురేందర్ రెడ్డి కి గట్టిగానే దెబ్బేసింది.. ఎన్నో అంచనాలతో అఖిల్ కి బ్లాక్ బస్టర్ ను గిఫ్ట్ గా ఇస్తాననే ధీమాతో సురేందర్ రెడ్డి ఈ సినిమా తీశారు .. కానీ సినిమా మాత్రం తుస్సుమంది.. మరి అనిల్ కుమార్ అనే ఒక కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్న అఖిల్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు