Manchu Manoj: బేబీ బంప్ తో ఆకట్టుకున్న మౌనిక.. ఫొటోస్ వైరల్..!

మంచు మోహన్ బాబు చిన్న కొడుకు ప్రముఖ హీరో మనోజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. దొంగ దొంగది సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మనోజ్.. హీరోగా పరిచయం కావడానికి ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలలో నటించి మెప్పించారు.. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మనోజ్ ఆ తర్వాత చాలాకాలం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మొదటి భార్య ప్రణతి రెడ్డితో విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలను ఎట్టకేలకు ఒప్పించి ఈ ఇద్దరు 2023లో ఏడడుగులు వేసి కొత్త జీవితంలోకి ప్రవేశించారు..

ఇక మరొకవైపు భూమా మౌనిక రెడ్డికి కూడా ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. పెళ్లి అయిన తర్వాత గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్త విని అటు తమ కుటుంబ సభ్యులే కాదు అభిమానులు కూడా సంతోషంగా ఉన్నట్లు కామెంట్లు చేశారు.. అయితే తాజాగా భూమా మౌనిక తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ లో మౌనిక దిగిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మనోజ్ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసిన మౌనిక ఒక ఎమోషనల్ క్యాప్షన్ ని కూడా జత చేసింది. “నాలో ఉన్న లైఫ్.. నా పక్కన ఉన్న లైఫ్.. ఎప్పటికప్పుడు నన్ను ఆకర్షిస్తాయి.. మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తాయి” అంటూ మౌనిక ఒక పోస్ట్ చేసింది.. తన మొదటి కొడుకు ధైరవ్, మనోజ్ లను ఈ పోస్ట్ కి టాగ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. దీనికి రెస్పాండ్ అయినా మనోజ్ “ఓ పిల్ల.. ఓ పిల్ల.. నువ్వంటే నాకు ప్రాణమే” అని కామెంట్ చేశాడు.

ఈ పోస్ట్ ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. ఇకపోతే బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ తో చూపరులను ఆకట్టుకుంటుంది మౌనిక.. ఇక త్వరలోనే ఒక బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఒక మనోజ్ విషయానికి వస్తే.. గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన ప్రస్తుతం బిజినెస్ లంటూ బిజీగా మారిపోయారు.. మరొకవైపు రాజకీయాలలోకి కూడా వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ త్వరలోనే పూర్తి విషయాలు తెలియనున్నాయి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు