Kalki 2898 AD : దీపికాకు షాక్ ఇచ్చేలా మేకర్స్ డెసిషన్… ఆమె పాత్ర కట్?

Kalki 2898 AD : మోస్ట్ అవైటింగ్ మూవీ కల్కి 2898లో దీపికా పదుకొనే పాత్రకు సంబంధించి క్యూరియాసిటీ రోజురోజుకూ పెరిగిపోతుంది. ఆమె తల్లి కాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుందా? అసలు సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు అభిమానుల మెదళ్లను తొలి చేస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మేకర్స్ దీపికాకు షాక్ ఇచ్చే డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

దీపికా పాత్ర కట్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ సినిమాలో ఉలగనాయగన్ కమల్ హాసన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా..  దిశా పటాని, దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పోస్టర్స్ లో దీపిక కనిపించింది. అయితే ఆమె తల్లి కాబోతున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి.

తల్లి కాబోతోంది కాబట్టి దీపిక కల్కి ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనడం కష్టమే అని చెప్పొచ్చు. ఇప్పటికే ఆమె ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎక్కడా కంపించట్లేదు. అందుకే ఆమెకు కంఫర్ట్ గా ఉండేలా మేకర్స్ ముంబైలోనే దీపికతో ప్రత్యేక ఇంటర్వ్యూలను ఏర్పాటు చేసి రికార్డు చేయడానికి ప్లాన్ చేస్తున్నారనే వార్త విన్పించింది.

- Advertisement -

కానీ తాజా సమాచారం ప్రకారం కల్కి 2898 ఏడి నుంచి దీపికా పదుకొనేకు సంబంధించిన భాగాన్ని తగ్గించాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె కేవలం అతిధి పాత్రలో కనిపించే విధంగా ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు. అంతేకాకుండా దీపిక ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొనదు అనే టాక్ నడుస్తోంది. పోస్టర్లలో ఆమె లుక్ చూసి ఎన్నో హోప్స్ పెట్టుకున్న దీపిక అభిమానులకు ఇది గట్టి షాక్ అని చెప్పొచ్చు.

దీపిక రోల్ ఇదేనా?

ఈ సినిమాలో ప్రభాస్ విష్ణువు చివరి అవతారమైన కల్కి భగవానుడి పాత్రలో కనిపించబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కల్కి పురాణం ప్రకారం పద్మ సింహల రాజు బృహద్రతుని భార్య కౌముది కూతురుగా, లక్ష్మీ దేవి అవతారంలోమ్ పద్మ అనే పాత్రలో దీపిక కనిపించబోతోందని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం కల్కి 2898 ఏడిలో ఆమె కేవలం ఒక గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపించబోతోంది అనే వార్త దీపిక అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చే దాకా ఆగాల్సిందే.

కాగా కల్కి 2898 మూవీ ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలోకి రాబోతోంది. ఇటీవల మేకర్స్ రిలీజ్ డేట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మూవీ థియేటర్లలోకి రావడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లానింగ్ లో మునిగిపోయారు చిత్రబృందం. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు