RT75 : రవన్న రాబోయే సినిమాలో పాత్ర ఇలా ఉండబోతుందా?

RT75 : టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ కి ఉండే క్రేజే వేరన్న సంగతి తెలిసిందే. రవితేజ సినిమా అంటే చిన్న నుండి పెద్ద ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ పక్కా అని ఫిక్స్ అవుతారు. తన నుండి మినిమం సినిమా ఉంటుందని ఫ్యాన్స్ భావించేవారు. స్వయంకృషితో వచ్చిన ఈ హీరో హీరో ఫ్రెండ్ పాత్రల నుండి హీరోగా ఎదిగిన వైనం చూస్తుంటేనే తెలిసిపోతుంది రవితేజ ఎంత కష్టపడ్డాడో. అలా ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టెడుగుతూ ఊర మాస్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో మాస్ సినిమాలకి కేరాఫ్ గా మారాడు. మాస్, కామెడీ, యాక్షన్ తరహా సినిమాలలో దిట్ట అయిన రవితేజ ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతాడు. నిజానికి రవితేజ ఎంటర్టైన్మెంట్ రోల్స్ మాత్రం ఇరగదీస్తాడని చెప్పాలి. అయితే గత కొన్నాళ్లుగా మాత్రం రవితేజ తన లోని మాస్ యాంగిల్ ని, ముఖ్యంగా కామెడీ యాంగిల్ ని మిస్ అయ్యాడని తన సినిమాలను చూస్తే తెలిసిపోతుంది. ఇక రెండేళ్ల కింద ధమాకా అంటూ హిట్టు కొట్టిన రవన్న దానికి ముందు తర్వాత అరడజనుకి పైగా ప్లాపులు అందుకోగా, తిరిగి పంథా మార్చుకుని పాత రూట్ లోకి రావాలని చూస్తున్నాడు.

ఆ యంగ్ రచయిత ని పరిచయం చేస్తున్న రవన్న?

ఇక మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) తాను ఎదురుకున్న ప్లాపుల నుండి తేరుకుని మూస ధోరణిలో కాకుండా ఎలాగైనా హిట్టు కొట్టాలని కసితో ఉన్నాడు. అందుకే తన పాత స్టైల్ లో ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేయాలనీ చూస్తున్నట్టు తెలుస్తుంది. యాక్షన్ సినిమాలతో వరుస ఫ్లాప్స్ విసుగెత్తిపోయిన రవన్న ఈ సారి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాతో రాబోతున్నాడు. ఈ క్రమంలో రవితేజ కు సామజవరగమన కథా రచయిత ‘భాను బోగవరపు’ చెప్పిన కథ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ. కొన్ని రోజుల నుండి వీరి కాంబోలో సినిమా వస్తుందని వార్తలు రాగా, తాజాగా ఉగాది నాడు అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇక కొత్త దర్శకుల్ని పరిచయం చేసి సక్సెస్ కొట్టడంలో ఉద్ధండుడు మన మాస్ రాజా. అప్పట్లో హరీష్ శంకర్, బాబీ లాంటి కమర్షియల్ దర్శకుల్ని పరిచయం చేసింది రవన్నే.

కొత్త సినిమాలో ఇలాంటి పాత్రలో రవన్న..

ఇక తాజాగా రవితేజ (RT75) సినిమా అనౌన్స్ మెంట్ జరగగా, భానుభోగవరపు దర్శకుడిగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మాణం లో ఈ సినిమా తెరకెక్కనుండగా, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. హరీష్ శంకర్ తో చేస్తున్న మిస్టర్ బచ్చన్ తర్వాత ఈ సినిమా ఉండబోతుండగా, వచ్చే సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కొన్ని రవితేజ పాత్ర గురించి కొన్ని హింట్స్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు లక్ష్మణ్ భేరి అని, ఆ పేరు కింద ఉగాది నాడు రాసి ఫలాల డీటెయిల్స్ ఇవ్వగా, అందులో ఆదాయం చెప్పన్ అని, వ్యయం లెక్క చెయ్యన్ అని, అవమానం జీరో అని, రాజపూజ్యం అన్లిమిటెడ్ అని ఉంది. అంటే ఈ సినిమాలో ఒక ఉద్యోగం లేని వాడిగా ఆల్మోస్ట్, వెంకీ సినిమాలో వెంకటేశ్వర్లు రేంజ్ లో చూపిస్తున్నారని అనిపిస్తుంది. ఇక ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో బ్యాక్ లో జాతర సీన్లు కూడా చూపించారు. అంటే బహుశా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కూడా సినిమా తెరకెక్కవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు