NTR(War 2): కెరియర్ లో ఫస్ట్ టైం అలాంటి పని.. షాక్ లో ఫ్యాన్స్..!

NTR (War 2).. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత క్రేజ్ మరింత పెరిగింది.. దీంతో గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు. ప్రస్తుతం బాలీవుడ్ వైపు కూడా తన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఎన్టీఆర్.. అందుకే హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ -2 చిత్రంలో కూడా ఢీకొట్టే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా ముంబైలో జరిగినట్టుగా సమాచారం. అయితే ఎన్టీఆర్ కు సంబంధించి ఎక్కడో ఒకచోట ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతూ ఉంటాయి. ఎన్టీఆర్- హృతిక్ రోషన్ ఇద్దరూ కలిసి ఒక పాటకు స్టెప్పులు వేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

NTR (War 2): First time in career such work.. Fans in shock..!
NTR (War 2): First time in career such work.. Fans in shock..!

హృతిక్ తో కలిసి స్టెప్పులెయ్యనున్న ఎన్టీఆర్..

వీరిద్దరికి సంబంధించి పాటకి వైభవి మర్చంట్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాటలో కొన్ని క్రేజీ స్టెప్పులను కూడా కంపోజ్ చేయబోతున్నట్లు సమాచారం. కేవలం మూడు రోజులలోనే ఈ పాట మొత్తం షూటింగ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేశారట.. అందుకే ఎలాంటి ఆలస్యం లేకుండా వీలైనంత త్వరగా ఈ పాటను సైతం రిహార్సల్ తో ముగించేయాలని అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఈ విషయం పైన మాత్రం ఎన్టీఆర్ అభిమానులు కాస్త ఫైర్ అవుతున్నట్లు సమాచారం.

మొదటిసారి రిహార్సల్స్ చేస్తున్న ఎన్టీఆర్..

ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడుకి డాన్స్ వల్లే మంచి క్రేజ్ ఉంది.. ఎలాంటి మూమెంట్స్ అయినా సరే ఇట్టే చేయగలడు.. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది కొరియోగ్రాఫర్లు కూడా చాలా సందర్భాలలో వెల్లడించారు. అలాంటి హీరోకి ఇప్పుడు ఇన్ని రోజులు రిహార్సల్ అవసరమా అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ తన కెరియర్ లోని మొట్టమొదటిసారి సాంగ్ కోసం ఇంత రిహార్సల్ చేస్తున్నారని చెప్పవచ్చు. వార్ -2 చిత్రం కోసమే ఎన్టీఆర్ దాదాపుగా రెండు నెలల పాటు తన సమయాన్ని కేటాయించారు.

- Advertisement -

సీక్రెట్ ఏజెంట్గా ఎన్టీఆర్..

వార్ -2 తో ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్లో నటిస్తూ ఉన్నారు. ఇందులో ఎన్టీఆర్ కూడా సీక్రెట్ ఏజెంట్గా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. సరికొత్తగా ఎన్టీఆర్ ని చూపించే విధంగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో కియారా అద్వాని కూడా హీరోయిన్గా నటిస్తోంది.. అయితే ఎన్టీఆర్ కు జోడిగా ఎవరు నటిస్తున్నారు అనే విషయం పైన ఇప్పటివరకు ఇంకా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ తన భార్యతో కలిసి బాలీవుడ్ సెలబ్రిటీల డిన్నర్ లో పాల్గొనడం జరిగింది. మరి వార్-2 తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో బిజీగా మారుతారేమో చూడాలి.

ఎన్టీఆర్ సినిమాలు..

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే తెలుగులో దేవర అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇక తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు