Aparichitudu ReRelease : చియాన్ ఫ్యాన్స్‌కి క్రేజీ న్యూస్… అపరిచితుడు మళ్ళీ వచ్చే డేట్ ఫిక్స్

Aparichitudu ReRelease : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శివ పుత్రుడు, అపరిచితుడు, ఐ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో సౌత్ ఇండియా ప్రేక్షకులని అలరిస్తూ, ప్రతి సినిమాకి కొత్త దనం చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉండగా విక్రమ్ ని పాన్ ఇండియా స్టార్ గా మలిచిన సినిమా ఏదంటే అందరూ చెప్పే ఒకే ఒక్క సినిమా “అపరిచితుడు”. ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పేరున్న శంకర్ షణ్ముగం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆ రోజుల్లో సంచలన విజయం సాధించింది. అప్పటివరకు కోలీవుడ్ కే పరిమితమైన విక్రమ్ ని ఇండియా వైడ్ గా పాపులర్ చేసింది.

2005 లో శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ‘అపరిచితుడు’ చిత్రాన్ని వి.రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తన ఆస్కార్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించాడు. అప్పటికీ ‘శివపుత్రుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు విక్రమ్ చేరువైనా, తనకి తెలుగులో మార్కెట్ సుస్థిర పడేలా చేసిన చిత్రం ‘అపరిచితుడు’ అనే చెప్పాలి. అప్పటి నుండీ విక్రమ్ నటించిన అన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ స్థాయి విజయం మళ్ళీ దక్కలేదని చెప్పాలి. అయితే ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ మూవీ అయిన “అపరిచితుడు” రీ రిలీజ్ కాబోతుంది.

విక్రమ్ నట విశ్వరూపం..

ఇక చియాన్ విక్రమ్ అంతకు ముందే సేతు, శివ పుత్రుడు వంటి సినిమాల్లో తన అద్భుతమైన నటనతో జాతీయ అవార్డు ని సైతం అందుకుని సంచలనం సృష్టించాడు. కానీ శంకర్ కలయికలో వచ్చిన అపరిచితుడు లో అంతకు మించి ఓ రేంజ్ లో నటిస్తాడని ఎవరూ ఊహించి ఉండరేమో. ప్రీ క్లైమాక్స్ లో ఓ సీన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో ప్రకాష్ రాజ్ విక్రమ్ ని బంధించి అపరిచితుడు కోసం చిత్ర హింసలకు గురి చేస్తాడు. అప్పుడు ఒక్క సరిగా రామా నుండి అపరిచితుడు గా మారిపోయిన విక్రమ్, ఒకేసారి రామా, అపరిచితుడు పాత్రలని రిపీట్ చేసి అదరగొడతాడు. ఆ సమయంలో ప్రకాష్ రాజ్ అన్నట్టు కమల్ ని చూసాను.. రజిని ని చూసాను.. కానీ నీ లాంటి నటుడ్ని చూడలేదురా! అని.. అపరిచితుడు ని చూస్తే నిజమే అనిపిస్తుంది. ఇదిలా ఉంచితే విక్రమ్ అపరిచితుడు త్వరలో రీ రిలీజ్ కాబోతుంది.

- Advertisement -

అపరిచితుడు రీ రిలీజ్ ఆరోజే..

ఇక విక్రమ్ నటించిన బ్లాక్ బస్టర్ అపరిచితుడు (Aparichitudu ReRelease) సినిమాని ఈ నెల మే 17న రీ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. విక్రమ్ అభిమానులకి ఇది క్రేజీ న్యూస్ అని చెప్పాలి. ఇక ఇప్పటికీ ‘అపరిచితుడు’ చిత్రాన్ని బుల్లితెర పై ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇక అపరిచితుడు 2005 జూన్ 17న విడుదలై ఘానా విజయం సాధించగా, తెలుగులో అప్పట్లో 13 కోట్ల షేర్ వసూలు చేసి బయ్యర్లకు రెండు రెట్లు భారీ లాభాలని అందించింది. ఇక గత కొంతకాలంగా సరైన సినిమా లేక నిరాశ పడ్డ విక్రమ్ ఫ్యాన్స్ కి ఇది జోష్ ని నింపే వార్త అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు