Vishwambhara : విశ్వంభర లో మెగా అప్పీరెన్స్..? ఇది నిజమైతే లెక్కలు మారిపోతాయి!

Vishwambhara : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో “విశ్వంభర” సినిమా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ వశిష్ట కాంబినేషన్ లో ఈ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ లో దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా అభిమానుల్లోనే కాదు కామన్ ఆడియన్స్ లోనూ భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సగభాగం పూర్తయిందని సమాచారం. ఇక సినిమా లో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. రెండు దశాబ్దాలుగా కెరీర్ కొనసాగిస్తున్నా త్రిష తెలుగు సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది.

ఇక ఇప్పుడు దాదాపు దశాబ్దం తర్వాత త్రిష మళ్ళీ తెలుగు సినిమాకు సైన్ చేసింది. ఆమె చివరి తెలుగు సినిమా నాయకి. లేడీ ఓరియెంటెడ్ గా వచ్చిన ఈ చిత్రం 2006లో రిలీజ్ అయింది. ఇది కూడా తమిళ – తెలుగు ద్వి భాషా చిత్రం. ఇక చిరంజీవి విశ్వంభర సినిమా గత నెలరోజులుగా హైదరాబాద్ చుట్టుపక్కలే షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ వశిష్ట. ఇక ఈ సినిమాలో చిరు ని నెవర్ బిఫోర్ అనేలా చూపిస్తున్నాడట. రీ ఎంట్రీ తర్వాత చిరు రొటీన్ సినిమాలు చేస్తున్నాడన్న టాక్ వచ్చింది. వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ కొట్టినా అది కథ పరంగా రొటీన్ అనే అంటున్నారు జనాలు.

విశ్వంభర లో మెగా సప్రైజ్..

ఇక ఇలాంటి వాటన్నిటికి, సరైన జవాబు ఇచ్చేలా చిరు రిస్కీ ఫైట్స్, యాక్షన్ సీన్స్ వంటివి కొత్తగా చేసి విశ్వంభర ది బెస్ట్ అనిపించుకోవాలని చూస్తున్నాడు. అందుకే సినిమా కోసం చిరంజీవి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో వశిష్ట మరో మెగా సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చిరు విశ్వంభర సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సర్ ప్రైజ్ క్యామియో ఒకటి ప్లాన్ చేస్తున్నారట. ఆ రోల్ చాలా తక్కువ నిడివితోనే ఉంటుందట. కానీ సినిమాపై ఇంపాక్ట్ ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం. ఇక చిరంజీవి పవన్ కళ్యాణ్ ఒకే వేదిక పంచుకుంటేనే మెగా ఫ్యాన్స్ ఊగిపోతారు. అలాంటిది ఇద్దరు కలిసి స్క్రీన్ పై కనిపిస్తే మాత్రం రచ్చ రంబోలా చేస్తారు. ఇప్పుడు చిరు విశ్వంభరలో ఆ ఛాన్స్ ఉంటుందని టాక్. మొన్నామధ్య చిరు ని కలవడానికి విశ్వంభర లొకేషన్స్ కి వచ్చినప్పుడే ఒప్పించారని టాక్. ఇక అప్పట్లో చిరు శంకర్ దాదా జిందాబాద్ లో పవన్ మూడు నిమిషాల పాత్రలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో సినిమా అంతగా ఆడలేదు గాని, పవన్ ఎంట్రీ కి థియేటర్లు దద్దరిల్లాయి.

- Advertisement -

అంచనాలకు మించి విశ్వంభర..

ఇక ఇప్పుడు విశ్వంభర(Vishwambhara) లో కూడా పవన్ ఎంట్రీ కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక అన్నయ్య సినిమా అంటే పవన్ నో చెప్పే ఛాన్స్ లేదు. వశిష్ట ప్లాన్ కు చిరు కూడా సరే అన్నట్టు టాక్. విశ్వంభర సినిమాలో పవన్ గెస్ట్ రోల్ ఉంటే మాత్రం ఆ సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పనక్కర్లేదు. ఇక గ్రాఫిక్స్ ప్రధానంగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో వస్తున్న విశ్వంభర సినిమా మెగా ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందని అంటున్నారు. ఇక విశ్వంభర సినిమాకు కీరవాణి మ్యూజిక్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు. సినిమా హైలెట్ గా చెప్పుకునే అంశాల్లో సంగీతం కూడా ఉండేలా కృషి చేస్తున్నారు ఎం.ఎం కీరవాణి. ఈ సినిమాను 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు