Tollywood : తెలుగు స్టార్ హీరోస్ అఫిషియల్ గా ఒక్కో సినిమాకి తీసుకుంటున్న రెమ్యూనరేషన్స్ ఇవే!

Tollywood : టాలీవుడ్ లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కడం చాలా కామన్ అయిపొయింది. స్టార్ హీరోల నుండి మీడియం రేంజ్ హీరోల దాకా అందరూ చేస్తున్నారు. తెలుగు సినిమా ఇంటెర్నేషనల్ రేంజ్ కి ఎదగడం తో చాలా మంది స్టార్ హీరోల అభిమానులు తమ హీరో ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఆ హీరో వందల కోట్లు తీసుకుంటున్నాడు. అంటూ సినిమా బడ్జెట్ ని బట్టి ఫిక్స్ అయిపోతున్నారు. అయితే పెరిగే మార్కెట్ ని బట్టి హీరో రెమ్యూనరేషన్ ఎక్కువ తీసుకోవడం కామనే. ఎందుకంటే వారి మార్కెట్ డిమాండ్ అలా ఉంది. అయితే ఈ మధ్య ఫ్యాన్స్ దేశంలోనే తమ హీరో ఎక్కువ తీసుకుంటున్నాడని, తమ హీరో వందల కోట్లు తీసుకుంటున్నాడని లెక్కలు వేసుకుంటున్నారు. దీన్ని బట్టి కూడా హీరో లెక్కేస్తారు సినిమా ఇండస్ట్రీ లో. అందుకే తెలుగు సినిమా అభిమానులు, అలాగే సామాన్య సినీ ప్రేక్షకులకు సైతం తమ హీరోలు అలాగే ఇతర హీరోలు ఇండస్ట్రీలో ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో అనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆయా స్టార్ హీరోలు ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అని బయట వినిపిస్తున్నా అది ఎంతవరకు నిజమో తెలియదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోలలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు ఎవరెవరో అఫిషియల్ గా వచ్చిన సమాచారం బట్టి ఈ లెక్కలు చెప్తున్నాం. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న స్టార్స్, ఆయా సినిమాల రిజల్ట్ ని బట్టి ముందు ముందు రెమ్యూనరేషన్ ని పెంచిచ్చు కూడా.

రెమ్యూనరేషన్ కాకుండా ప్రాఫిట్ లో కూడా షేర్..

అయితే ప్రేక్షకులు ఇక్కడ గమనించాల్సిన మరో విషయం, కొంత మంది స్టార్ హీరోలు తమ సినిమాలకు రెమ్యునరేషన్ డబ్బులు తీసుకోవడానికి బదులుగా, ఆ సినిమాల శాటిలైట్, డిజిటల్ రైట్స్ ని, లేదా ఏరియాల వారి రైట్స్ ని రెమ్యునరేషన్ కింద తీసుకుంటారు, లేదా సినిమా కి కొంత పెర్సెంటేజ్ కింద అమౌంట్ ని ముందే మాట్లాడుకుని లాభాల్లో వాటా తీసుకుంటారు. ఈ పద్ధతి మొదలు పెట్టింది మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి ఆ రోజుల్లో స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలు చేస్తున్న సమయంలోనే నైజాం ఏరియా నుండి లాభాల్లో వాటా తీసుకునే వారు. అయితే ప్రస్తుతం చిరు ఓన్ ప్రొడక్షన్ లోనే చేస్తున్నాడు, కాబట్టి ఎంత రెమ్యునరేషన్ అన్నది క్లియర్ గా చెప్పలేం. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో కూడా ఉంటాడు, కాబట్టి రెమ్యునరేషన్ బదులు టోటల్ ప్రాఫిట్ షేర్ తీసుకుంటాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ కూడా తీసుకుంటూ ఉండగా, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు ఇప్పటి వరకు కేవలం రెమ్యునరేషన్ ని మాత్రమె తీసుకుంటూ వచ్చారు. తర్వాత వీరు కూడా ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు. ఇక ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం తో రెమ్యునరేషన్ భారీ లెవల్ లో తీసుకోవడమే కాకుండా ప్రాఫిట్ షేర్ కూడా బాగానే తీసుకునే అవకాశం ఉంది. ఒక సారి మన తెలుగు (Tollywood) హీరోలకు కేవలం నిర్మాతలు ఇచ్చే రెమ్యునరేషన్ వివరాలు చూసుకుంటే..

చిరంజీవి – 2017 నుండి 40 కోట్ల పైనే..
బాలకృష్ణ – 2022 నుండి 20 -22 కోట్లు
వెంకటేష్ – 10 కోట్లు
నాగార్జున – 6-8 కోట్లు

- Advertisement -

ప్రభాస్ బాహుబలి కి ముందు 8 కోట్లు – ఆ తర్వాత 100 కోట్లు
అల్లు అర్జున్ – పుష్ప కి ముందు 40 కోట్లు.. ఇప్పుడు 100 కోట్లు(పుష్ప2)
ఎన్టీఆర్ – 75 కోట్లు (వార్2)
రామ్ చరణ్ – 80 కోట్లు(గేమ్ ఛేంజర్ )
పవన్ కళ్యాణ్ – 55 కోట్లు
మహేష్ బాబు – 50 కోట్లు
రవితేజ -15 -18 కోట్లు
నాని -12-15 కోట్లు
విజయ్ దేవరకొండ – 12కోట్లు
నాగ చైతన్య – 8 కోట్లు
రామ్ – 7-8 కోట్లు
అఖిల్ – 5 కోట్లు
సాయి తేజ్ – 5 కోట్లు
నితిన్ – 4 కోట్లు
వరుణ్ తేజ్ – 4 కోట్లు
గోపీచంద్ – 4 కోట్లు

ఇవన్నీ ఆయా స్టార్ హీరోలు నటించి రిలీజ్ అయిన రీసెంట్ మూవీస్, రెమ్యునరేషన్ లెక్కలు. ప్రాఫిట్ షేర్ లెక్కలు ఎవ్వరూ పెద్దగా రివీల్ చేయరు కాబట్టి అవి అఫిషియల్ గా ఎంత అనేది వాళ్ళకే క్లియర్ గా తెలుస్తాయని చెప్పొచ్చు. మిగిలిన హీరోల్లో ఎక్కువ శాతం 4 కోట్లకంటే తక్కువే తీసుకుంటున్నారు. సినిమా సినిమా కి రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న హీరోలు హిట్లకు ఫ్లాఫ్స్ కి అతీతంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతూ దూసుకు పోతున్నారు. ఇక ఈ ఏడాది రానున్న భారీ పాన్ ఇండియా సినిమాలతో స్టార్ హీరోల రెమ్యూనరేషన్ లెక్కలు మారొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు